Chanakya Niti: ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలి అనే విషయం ఎవరు ప్రత్యేకంగా చెప్పరు. తల్లిదండ్రులు లేదా గురువుల వద్ద మనిషి జీవితం ఎలా ఉండాలో తెలుసుకోవాల్సిందే. అయితే చాణక్యుడు ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలో తన నీతి బోధనల ద్వారా ప్రజలకు అందజేశాడు. ఆయన నీతి సూత్రాలు పాటిస్తూ ఎంతోమంది తమ జీవితాలను సార్ధకం చేసుకున్నారు. కొంతమంది అప్పటినుంచి ఇప్పటివరకు చాణక్య నీతి సూత్రాలను పాటిస్తూ జీవితాలను సుఖశాంతులతో నింపుకున్నారు. అయితే చాణక్య నీతి ప్రకారం సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు చాలా అవసరం అని తెలుపుతుంది. కానీ కొందరి వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యని తెలుపుతుంది. ముఖ్యంగా కొందరి ఇళ్లలోకి వెళ్లకూడదని.. భోజనానికి పిలిచి వారి ఇంటి వైపు చూడవద్దని చాణక్యనీతి నా..తెలుపుతుంది.సాధారణంగా ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే వెంటనే వెళ్తాం. కానీ కొందరి ఇళ్లల్లో భోజనం చేయడం అంత మంచిది కాదని చాణక్య నీతి తెలుపుతుంది. వాళ్లు ఎవరంటే?
Also Read: ఇంట్లో చీపురుని ఇక్కడ పెడితే దరిద్ర తాండవిస్తుంది..
అప్పు ఇచ్చినవారు..
ఎవరైనా అప్పు ఇచ్చి నా వారు అయితే.. వారి ఇళ్లలోకి భోజనానికి ఆహ్వానం వస్తే వెళ్లకూడదని చాణక్య నీతి తెలుపుతుంది. ఎందుకంటే వారు డబ్బు ఇచ్చారు కాబట్టి వారి ఇంటికి భోజనానికి వెళ్తే వారు చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు ఇచ్చిన డబ్బు కనుక సమయానికి ఇవ్వకపోతే మరింత అవమానించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి వారి ఇంటికి భోజనానికి వెళ్లకపోవడమే మంచిదని చాణక్య నీదే తెలుపుతుంది.
తప్పులు చేసిన వారి ఇంటికి..
కొందరు కావాలనే కొన్ని తప్పులు చేసి నేరస్తులుగా మిగిలిపోతారు. ఇలాంటి వారి ఇంటికి భోజనానికి వెళ్లడం ద్వారా వెళ్లిన వారిని వారితో సమానంగా చూస్తారు. అంటే వారితో స్నేహం ఉందని అనుకొని వీరు కూడా నేరస్తులే అన్నట్లుగా భావిస్తారు. అందువల్ల అలాంటి వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్లకపోవడమే మంచిది.
డబ్బు ఆశ ఉన్నవారి ఇంటికి..
సాధారణంగా డబ్బు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. కానీ కొందరికి ఈ డబ్బు అత్యాశతో కూడుకొని ఉంటుంది. ఇలా అతిగా డబ్బు ఆశ ఉన్న వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్తే వారు వెళ్లిన వారి నుంచి ఏవైనా ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే వారిని ఇంటికి భోజనానికి పిలిచినా.. వెళ్లిన వారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. అంతేకాకుండా కేవలం డబ్బు ఆశతోనే వారు మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. లోపల మాత్రం ఆలోచనలు వేరే ఉంటాయి.
బాధ కలిగించేవారు..
కొందరు కొన్ని మాటల వల్ల బాధలను కలిగించే వారి ఇంటికి భోజనానికి వెళ్లకపోవడమే మంచిదని చాణిక్య నీదే తెలుపుతుంది. ఎందుకంటే ఓవైపు భోజనానికి ఆహ్వానించి.. మరోవైపు అవమానకరమైన మాటలతో ఎదుటివారిని బాధపెడుతూ ఉంటారు. అందువల్ల ఇలాంటి వారి ఇంటికి వెళ్లడం గాని లేదా వీరిని ఇంటికి ఆహ్వానించడం కానీ చేయొద్దని చాణక్యనీతి తెలుపుతుంది.
దైవభక్తి లేనివారు..
దైవభక్తి లేని వారి ఇంటికి భోజనానికి వెళ్లడం ద్వారా ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే వారు కేవలం ఏదో ఆశించి మాత్రమే భోజనానికి పిలుస్తారు. వారి ఆహ్వానంలో మర్యాద.. లేదా ధర్మం అనేది పాటించరు. అందువల్ల ఇలాంటి వారి ఇంటికి వెళ్లకపోవడమే మంచిదని చాణక్యనీతి తెలుపుతుంది.
Also Read: హైదరాబాద్ వెరీ కాస్ట్లీ…రూ. 31,000 లేనిదే జీవితం సాగదు.. కారణం ఇదే.