Chanakya Niti: చాణక్యుడు చాలా విషయాల గురించి వివరించారు. ఆయన చెప్పిన విధివిధానాలు పాటిస్తే విజయం తప్పకుండా వరిస్తుంది. అదే విధంగా జీవితంలో మంచి దారిలో కూడా నడుస్తారు. అయితే కొన్ని విషయాల్లో సిగ్గు పడకూడదు. సిగ్గు పడితే చాలా విషయాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ధైర్యంగా ఉంటేనే ఈ సమాజంలో బతకడం ఈజీ. లేదంటే చాలా విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది. మొహమాటం కూడా అసలే పనికిరాదు. మరి ఎలాంటి విషయాల్లో సిగ్గు పడకూడదు? ఎందుకు పడకూడదు అనే వివరాలు చాణక్యుడు వివరించారు ఓ సారి తెలుసుకోండి..
ఆకలి విషయంలో.. ఆకలి విషయంలో ఎప్పుడు సిగ్గు పడకూడదు. దీని వల్ల పస్తులుండాల్సి వస్తుంది. అదే జరిగితే ఆరోగ్యం చెడిపోతుంది. అనారోగ్యపాలైతే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిందే. అందుకే అన్నం విషయంలో సిగ్గు పడకూడదు. ఎవరింటికి అయినా అతిథిగా వెళ్తే.. వారు తినమంటే తినాలి. సగం కడుపుతో ఉండాల్సి వస్తుంది. లేదా మొత్తం ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు కడుపు నిండా తినాలి కాబట్టి.. సిగ్గు వదిలేయండి.
డబ్బు.. డబ్బు విషయంలో కూడా సిగ్గు పడకూడదు. స్త్రీ అయినా పురుషుడు అయినా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. డబ్బుతో కూడిన విషయాల్లో సిగ్గుపడితే విజయం సాధించడం కష్టమే. కొంతమంది డబ్బులు ఇస్తారు కానీ తిరిగి అడగడానికి సిగ్గుపడతారు. దీని వల్ల డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. ధననాష్టాన్ని తెచ్చే ఈ సిగ్గును డబ్బు విషయంలో కూడా వదిలిపెట్టండి అని వివరించారు చాణక్యుడు.
జ్ఞానం సంపాదించాలి..
జ్ఞానం సంపాదించడానికి కూడా ఎప్పుడు సిగ్గపడవద్దు. గురువు, స్నేహితులు ఇలా ఎవరిని అయినా ఏదైనా అడగడానికి సమాధానాలు తెలుసుకోవడానికి సిగ్గు పడకూడదు. ఉపాధ్యాయుల నుంచి ఏదైనా విషయం తెలుసుకోవడానికి సిగ్గు పడితే విద్య మీ నుంచి దూరం అవుతుంది అన్నారు చాణక్యుడు.