https://oktelugu.com/

KA Paul Viral Video: మీడియాను శపించిన కేఏ పాల్.. వీడియో వైరల్

ఇటీవల తను పాల్గొన్న సభలకు సంబంధించి మీడియా వార్తలు కవరేజ్ చేయడం లేదట. ఫస్ట్ పేజీ లో ప్రచురించడం లేదట. ఆ న్యూస్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేయడం లేదట. షర్మిలకు ఇచ్చినంత ప్రాధాన్యం పాల్ కు ఇవ్వడం లేదట.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 19, 2024 3:55 pm
    KA Paul warns media channels

    KA Paul warns media channels

    Follow us on

    KA Paul Viral Video: ఏపీ రాజకీయాల్లో పాల్ హవా మొదలైనట్టే. నిన్నటిదాకా సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా “ఫైర్ విల్ ఫైర్.. ఐ యాం ఫైర్” రెచ్చిపోయారు. మీడియాపై చిందులు తొక్కారు. మీడియా యాజమాన్యాల ను శపించారు. కుటుంబాలు నాశనం అయిపోతాయని హెచ్చరించారు. ఇంతకీ పాల్ అగ్నిగోళంలా మండిపోవడానికి కారణం లేకపోలేదు.

    ఇటీవల తను పాల్గొన్న సభలకు సంబంధించి మీడియా వార్తలు కవరేజ్ చేయడం లేదట. ఫస్ట్ పేజీ లో ప్రచురించడం లేదట. ఆ న్యూస్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేయడం లేదట. షర్మిలకు ఇచ్చినంత ప్రాధాన్యం పాల్ కు ఇవ్వడం లేదట. పవన్ కళ్యాణ్ దగ్గర ప్యాకేజీ తీసుకున్న మీడియా..పాల్ ను పట్టించుకోవడంలేదట. దేశానికి ఏమి చేయని నరేంద్ర మోడీ విషయంలో చూపిస్తున్న ఆసక్తి..పాల్ పై చూపించడం లేదట. ఏపీని అప్పుల మయం చేసిన చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తున్న మీడియా.. పాల్ గురించి ఒక్క ముక్క కూడా రాయడం లేదట. ఇవ్వన్నీ మనసులో ఎన్ని రోజులు పెట్టుకున్న పాల్ కు ఓపిక నశించి పోయిందట. అందుకే అలా బరస్ట్ అయ్యారు.

    మీడియాను దూషిస్తూ.. మీడియా యాజమాన్యాలను విమర్శిస్తూ పాల్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది తెగ సర్కులేట్ అవుతోంది. పాల్ ఆ వీడియోలో అత్యంత ఆగ్రహంగా మాట్లాడారు. మీడియా యాజమాన్యాలను ఏకీపారేశారు. అన్నట్టు ఆ మధ్య వేమూరి రాధాకృష్ణ పాల్ తో ఇంటర్వ్యూ చేస్తే యూట్యూబ్లో నెంబర్ వన్ స్థానంలో కొద్దిరోజులపాటు కొనసాగింది. ఆ తర్వాత రాధాకృష్ణ చేసిన ఏ ఇంటర్వ్యూ కూడా ఆ స్థాయికి వెళ్లలేకపోయింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో పాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాల్ కు మీడియా ఎందుకు కవరేజ్ ఇవ్వడం లేదు? బలమైన కవర్ ఇస్తేనే కవరేజ్ ఇస్తుందా? పోనీ అదే విషయాన్ని పాల్ తో మీడియా యాజమాన్యాలు చెబితే సరిపోతుంది కదా.. లక్ష కోట్లు తెచ్చినవాడు ఆఫ్ట్రాల్ మీడియా యాజమాన్యాలకు కవర్ ఇవ్వలేడా?!