టీజర్ లో ఎన్టీఆర్ మూడు గెటప్ లు కూడా !

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సీన్స్ ను తీస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది.. తారక్ గెటప్ ఎలా ఉండనుందని ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావుడి చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు […]

Written By: Neelambaram, Updated On : October 12, 2020 4:46 pm
Follow us on


పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సీన్స్ ను తీస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది.. తారక్ గెటప్ ఎలా ఉండనుందని ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావుడి చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడని.. ఆ మూడు గెటప్ లకు సంబందించే ఈ రోజు షూట్ చేస్తున్నారట, తారక్ పై రిలీజ్ చేసే.. టీజర్ లో ఎన్టీఆర్ మూడు గెటప్స్ ను కూడా రివీల్ చేస్తారట.

Also Read: ‘ఆదిపురుష్’లో ఆదిదేవుడిగా అజయ్ దేవగణ్?

ఇంతకీ ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో కనిపించడానికి ప్రధాన కారణం.. శత్రువులు గుర్తు పట్టకుండా ఉండటానికి భీమ్ తరుచూ తన వేషాన్ని మారుస్తూ ఉండటమేనట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ కూడా సినిమాలో మూడు రకాలుగా ఉండబోతున్నాయట. ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. పైగా తారక్ కోసం ప్రత్యేకంగా డైలాగ్స్ కూడా రాయించాడు రాజమౌళి. మొత్తం సినిమాలోనే ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయట. ఎలాగూ తెలంగాణ యాస.. దీనికితోడు తారక్ మాడ్యులేషన్.. ఇక గొప్పగా ఉండక ఏమి చేస్తోంది.

Also Read: కడుపు మీద కొట్టకండి అని వేడుకుంటున్న బండ్ల గణేష్..?

కాగా ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సాంగ్స్ తో పాటు చాలా వరకూ నేపథ్య సంగీతాన్ని కూడా కీరవాణి పూర్తి చేశాడట. ఈ సినిమా పై అన్ని ఇండస్ట్రీల నుండి అత్యంత భారీ అంచనాలు ఉండటంతో అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా విశ్వసనీయత తగ్గకుండా, ముఖ్యంగా ఖర్చుకు ఏ మాత్రం భయపడకుండా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కు హీరోయిన్ గా శ్రీయా శరణ్ నటిస్తోంది.