https://oktelugu.com/

Cancer: నయం అయ్యాక మళ్లీ క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజమెంత?

క్యాన్సర్‌ వచ్చిన వారు తప్పకుండా చికిత్స తీసుకుంటారు. వీరిలో కొందరు మరణిస్తే మరికొందరు బయట పడతారు. అయితే క్యాన్సర్ పూర్తిగా నయం అయితే మళ్లీ రాదులే అని చాలా మంది అనుకుంటారు. అసలు క్యాన్సర్ నయం అయితే మళ్లీ వస్తుందా? ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: , Updated On : January 23, 2025 / 08:35 PM IST
Cancer

Cancer

Follow us on

Cancer: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్యాన్సర్ (Cancer) బారిన పడుతున్నారు. ప్రస్తుతం దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీనికి ముఖ్య కారణం మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల (Food Habits) వల్ల క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్వ కాలంలో ఆరోగ్యమైన ఆహారం తినేవారు. కానీ ప్రస్తుతం ఆరోగ్యానికి (Healthy) మేలు చేసే వాటి కంటే అనారోగ్యాన్ని ఇచ్చే వాటిని తింటున్నారు. వీటిని తినడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు (Womens) అయితే ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే చాలా మంది ఈ సమస్యతో చనిపోతున్నారు. దీనికి తోడు నిద్ర, పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకపోవడంతో చాలా మంది ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడుతున్నారు. అయితే క్యాన్సర్‌ వచ్చిన వారు తప్పకుండా చికిత్స తీసుకుంటారు. వీరిలో కొందరు మరణిస్తే మరికొందరు బయట పడతారు. అయితే క్యాన్సర్ పూర్తిగా నయం అయితే మళ్లీ రాదులే అని చాలా మంది అనుకుంటారు. అసలు క్యాన్సర్ నయం అయితే మళ్లీ వస్తుందా? ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

క్యాన్సర్‌కు చికిత్స చేసిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు తిరిగి పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. అయితే నయం అయిన తర్వాత కూడా క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో అన్ని క్యాన్సర్లు కాదని.. కేవలం కొన్ని క్యాన్సర్లు మాత్రమే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే రెండోసారి వచ్చినప్పుడు తొందరగా గుర్తించి దాన్ని క్లియర్ చేసుకునే దానిపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొందరికి మళ్లీ క్యాన్సర్ వచ్చిందని తెలిసినా కూడా లైట్ తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే మెదడు క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ నయం అయిన తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మూత్రాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఒక 35 శాతం వరకు ఉన్నాయి. అలాగే రొమ్ము క్యాన్సర్ కూడా చికిత్స తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మొదటి ఐదు సంవత్సరాలలో వస్తుంది. అయితే ఇది క్యాన్సర్ రకాన్ని బట్టి, లక్షణాలు బట్టి మారుతూ వస్తుంది. గడ్డలు, వాపు, నిరంతర పుండ్లు, నిరంతర దగ్గు, గొంతు నొప్పి, వివరించలేని బరువు తగ్గడం, పెరగడం, విపరీతమైన అలసట వంటి కారణాల వల్ల మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే రాత్రిపూట చెమటలు పట్టడం, మలబద్ధకం, విరేచనాలు, మూత్ర విసర్జనలో మార్పు, మలం లేదా మూత్రంలో రక్తం, కడుపు నొప్పి, కామెర్లు లేదా మూత్ర విసర్జన సమయంలో నొప్పి, ప్రేగు కదలికలలో మార్పులు మొదలైన వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్లీ రాకుండా ఉండాలంటే.. రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేసుకోవాలి. అలాగే సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ధూమపానం, మద్యపానం, ఒత్తిడికి గురి కాకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.