Parenting Tips
Parenting: ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే.. కనీసం తల్లిదండ్రులను (Parents) పట్టించుకోరు. ముఖ్యంగా యుక్త వయస్సులోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకుండా వదిలేస్తారు. స్నేహితులు(Friends), ఇతరులతో కలిసి ప్రవర్తన మార్చుకుంటారు. ఆ తర్వాత ఈ వయస్సులో పిల్లలకు పెద్దగా ఏం తెలియదు. ఇతరులు చెప్పినా కూడా వినే స్టేజ్‌లో ఉండరు. వారి సొంత నిర్ణయాలు తీసుకుంటూ.. లైఫ్‌ను నాశనం చేసుకుంటారు. ఆఖరుకి వారికి ఇష్టమైన వారు చెప్పినా కూడా పెద్దగా తెలుసుకోరు. అయితే పిల్లలు యుక్త వయస్సులో మారిపోకుండా ఉండాలంటే మాత్రం తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలను తెలియజేయాలి. వారిని సరైన పద్ధతిలో పెంచాలి. అప్పుడే పిల్లలు పెద్దయ్యాక కూడా ఎలాంటి తప్పుడు దోవ వైపు వెళ్లకుండా ఉంటారు. అయితే పిల్లలు యుక్త వయస్సులో దూరం పెట్టకుండా ఉంచాలంటే ఏం చేయాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
పిల్లలకు కొన్ని పరిమితులు ఉంచండి. వారి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడంతో పాటు ఏ విషయాలను ఎంత వరకు చెప్పాలో అంత వరకు మాత్రమే చెప్పండి. అవి కూడా ఎలా చెప్పాలో అలానే చెప్పండి. అప్పుడే పిల్లలు మారుతారు. అంతే కానీ ఎలా పడితే అలా చెబితే వాళ్లు వినరు. అలాగే పాత విషయాలు గుర్తు పెట్టుకోవద్దని చెప్పండి. పాత వాటిని గుర్తుపెట్టుకోవడం వల్ల బాధలు మాత్రమే ఉంటాయి. వాటి వల్ల వారు ఇతరుల మీద కోపంగా ఉంటారు. గొడవలు, తప్పులు అనేవి సహజం.. వాటిని ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉండాలని పిల్లలకు తెలియజేయండి. ఎప్పుడూ ప్రేమతో ఉండాలని పిల్లలకు నేర్పించండి. కొందరు సమస్యలు వస్తే తిండి మీద ఆసక్తి చూపించరు. ఇలా కాకుండా శారీరకంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. పిల్లలకు అన్ని విషయాలను గొప్పగా చెప్పాలి. వారికి తల్లిదండ్రులు ఒక రోల్ మోడల్‌గా కనిపించేలా ఉండాలి. అప్పుడే వారు జీవితంలో పైకి వస్తారు.
ఇతరులపై ఈర్ష్య, అసూయ వంటి భావనతో ఉండకుండా ఉండేలా చూసుకోండి. ఇతరులను విమర్శించడం, వారిని మాటలు అనడం వంటివి చేయవద్దు. ఇవి వారిలో కూరత్వానికి దారితీస్తుంది. ఎన్ని జరిగినా కూడా ఇతరులతో మంచిగా ఉండేలా చూసుకోండి. ఇతరులతో మంచిగా ఉండేలా వారిని తయారు చేయండి. అందరితో మంచిగా మాట్లాడే కమ్యూనికేషన్ ఉంటే వారు జీవితంలో మంచిగా ఉంటారు. లేకపోతే వారు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.