Vastu Tips: సాధారణంగా మనం కొన్ని రకాల బొమ్మలను ఇంట్లో అలంకరణ వస్తువులను ఉపయోగించుకుంటాము. ఈ క్రమంలోనే చాలామంది తాబేలు బొమ్మలను కూడా ఇంటికి తీసుకు వస్తారు. అయితే ఈ తాబేలు బొమ్మలను దైవ సమానంగా భావించి వీటిని దేవుని గదిలో ఉంచి పూజలు కూడా చేస్తారు.తాబేలు బొమ్మను సాక్షాత్తు మహా విష్ణు స్వరూపంగా భావించి పూజించడం వల్ల మనకు అంతా శుభమే కలుగుతుందని భావిస్తారు. అయితే చాలామంది తాబేలు బొమ్మను ఎలా ఇంట్లో పూజించాలి అనే విషయాలు తెలియక సతమతమవుతున్నారు.
Also Read: జగన్ ఇది నీకు తగునా? ప్రజలకు మూడు గంటల నరకం భావ్యమా?
అయితే మన ఇంటికి తెచ్చుకున్న తాబేలు బొమ్మ ఇంట్లో తయారు చేసినది లేదా క్రిస్టల్ తో తయారు చేసినదే వుండాలి. ఈ విధంగా ఇంటికి తెచ్చుకున్న తాబేలును ఒక ఇత్తడి ప్లేటులో పెట్టాలి. అలాగే ఒక గాజు గ్లాసు లేదా పింగాణీ గిన్నెలో నీటిని పోసి ఇత్తడి ప్లేట్ తో సహా ఆ తాబేలు బొమ్మను ఉత్తర దిశ వైపు ఉండేవిధంగా ఇంట్లో పెట్టి పూజించాలి. ఉత్తరదిశ కుబేరుడి స్థానం కనుక తాబేలును కూడా ఉత్తరదిశ వైపు పెట్టి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇలా ఉత్తర దిశవైపు పెట్టిన తరువాత ప్రతిరోజు గాజు గ్లాస్ లో ఉన్న నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టాలి. ఉత్తరదిశ బుధగ్రహానికి అనుకూలం కనుక మన పై ఉన్నటువంటి బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా కుబేరుడి అనుగ్రహం మనపై ఉండి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.అలాగే ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టడం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉన్న ఆ వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే తాబేలు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు ఏ మాత్రం కొదువ ఉండదు.ఇక ఈ తాబేలు బొమ్మను కేవలం ఇంటిలో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేసే చోట కూడా పెట్టడం వల్ల వ్యాపారం దినదినాభివృద్ధి కలుగుతుంది.
Also Read: టాలీవుడ్ సినీ ప్రముఖులతో జగన్ ఏం మాట్లాడారు? ఏ హామీలిచ్చారో తెలుసా?