HomeNewsBRS Leader Arrest: బీఆర్ఎస్ లో కీలకనేత అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఆ కేసులో...

BRS Leader Arrest: బీఆర్ఎస్ లో కీలకనేత అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఆ కేసులో పక్కా ఆధారాలున్నాయా..?

BRS Leader Arrest: తెలంగాణలో కీలక నేత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి జరిగిందంటూ ఆయన అరెస్టు కోసం గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉంటే తాజాగా వికారాబాద్ లో కలెక్టర్ సహా అధికారులపై దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ప్రస్తావించినట్లు సమాచారం. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తావించినట్లుగా పలు విషయాలతో రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. అందులో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు కేటీఆర్ తో ఫోన్ లో సంభాషించినట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని బుధవారం అర్ధరాత్రి ఆయన ఇంటి వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ లో నందినగర్ లో ఆయన ఇంటి వద్ద అనుచరుల కోలాహలం కనిపించింది. కీలక నేత హరీశ్ రావు కూడా కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. అయితే అలాంటిదేమి జరగలేదు. ఇక కేటీఆర్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. పలు వర్గాల ఆందోళనల వెనుక కేటీఆర్ హస్తం ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తున్నది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఆయన ప్రసంగాల్లో ఇదే ప్రస్తావించారు.

అయితే, గురువారం (నవంబర్ 14) సాయంత్రానికల్లా కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ మాత్రం ప్రచారం జరుగుతున్నది. ఆయనను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెడుతారని సమాచారం. ఇక 14 రోజుల రిమాండ్ తప్పదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే కేటీఆర్ అరెస్టును అడ్డుకుంటామని ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో నందినగర్ చేరుకోవడంతో అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.

అచ్చం రేవంత్ అరెస్ట్ లాగే..
గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని పోలీసులు ఇదే విధంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి పూట ఇంటి గోడలు ఎక్కి బెడ్ రూంలోకి వెళ్లి మరి అరెస్ట్ చేశారు. నాడు అత్యంత దారుణంగా రేవంత్ రెడ్డి పట్ల వ్యవహరించారని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేస్తే తప్పేంటని బీఆర్ఎస్ శ్రేణులు నాడు ప్రశ్నించారు.

ఇదే రీతిలో కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియా వేదిక చర్చ జరిగింది. అయితే కేటీఆర్ బెడ్రూంలో దాక్కో లేదని, పులిలా ప్రజల్లో ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు పంచ్ లు వేశారు. ఏదేమైనా ప్రస్తుతం తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ సర్కారు ఇలాంటి చర్యలకు దిగుతున్నదని మరికొందరు ఆరోపిస్తున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version