BJP ANDHRA PRADESH: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కష్టాలు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు తిరుగులేని పార్టీగా ఎదిగినా ప్రస్తుత తరుణంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. దీంతో బీజేపీలో కూడా వైసీపీ కి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. దేశంలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో ఏపీలో కూడా తన ముద్ర వేయాలని భావిస్తోంది. ఇందుకు గాను వైసీపీ ఆగడాలను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో ఇన్నాళ్లు సఖ్యతగా ఉన్నా రానురాను రెండు పార్టీల్లో వైరివర్గం తయారవుతోందని సమాచారం.

ఇప్పుడు బీజేపీ వ్యవహారాలను సీఎం రమేష్ చూస్తున్నారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ దురాగాతాలపై స్పందిస్తూ వారి తీరుపై కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. వైఎస్ జగన్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని చెబుతున్నారు.
Also Read: AP Cabinet: ఏపీ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. కారణమదే?
ఈ నెల 28న ప్రజాగ్రహ సభ పేరుతో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బీజేపీ నేతలంతా ప్రో వైసీపీ సభగా వైసీపీ సర్కారుపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో పరిస్థితులు మారుతున్నాయి. వైసీపీ నేతలపై కామెంట్లు పెరుగుతున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టంలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీని అన్ని మార్గాల్లో అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే లొసుగులను హైలెట్ చేస్తూ వైసీపీని బజారుకీడ్చాలని భావిస్తోంది. రాజకీయ పోరాటం చేసి పార్టీని ఎండగట్టాలని యోచిస్తోంది. దీనికోసం ప్రణాళికలు రచిస్తోంది.
Also Read: Cinema Theaters in AP: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల మూత.. ఏం జరగబోతోంది..?