Bigg boss telugu season 8: సోనియా మీద పెరుగుతున్న వ్యతిరేకత.. డానికి కారణం తన నోటి దురదేనా!

నెటిజన్లు సోనియాపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎందుకు అంటే బిగ్ బాస్ లో గొడవలు సాధారణమే. కానీ ఒక అమ్మాయి క్యారెక్టర్ ని తగ్గించి ఎవరూ మాట్లాడలేదు. విష్ణు ప్రియా చేసిన కామెడీ అడల్ట్ కామెడీ అనే దగ్గర నుంచి ఆమె వేసుకునే దుస్తుల వరకు ఆమెని మాటలతో హర్ట్ చేసింది.

Written By: Neelambaram, Updated On : September 10, 2024 8:01 pm

Bigg boss telugu season 8

Follow us on

Bigg boss telugu season 8: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే మొదటి వారం హౌస్ లో నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో టీమ్ లు ఉన్నాయి. ఈ సీజన్ బిగ్ బాస్ చూడడానికి ఎవరూ కూడా ఇష్టపెట్టుకోవడం లేదు. ఎందుకు అంటే చిన్న విషయాలకి కూడా సోనియా పెద్ద గొడవ చేస్తుంది. కూర్చుని మాట్లాడుకోవాల్సిన వాటికీ పెద్ద రచ్చ చేస్తుంది. మొన్న విష్ణు ప్రియా మీద అడల్ట్ కామెడీ అని మాటలతో హర్ట్ చేసింది. మళ్లీ నామినేషన్స్ లో ఆమెని ఇంకా మాటలతో బాధ పెట్టింది. విష్ణు ప్రియా క్యారెక్టర్ గురించి కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు సోనియాపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎందుకు అంటే బిగ్ బాస్ లో గొడవలు సాధారణమే. కానీ ఒక అమ్మాయి క్యారెక్టర్ ని తగ్గించి ఎవరూ మాట్లాడలేదు. విష్ణు ప్రియా చేసిన కామెడీ అడల్ట్ కామెడీ అనే దగ్గర నుంచి ఆమె వేసుకునే దుస్తుల వరకు ఆమెని మాటలతో హర్ట్ చేసింది.

ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలీదు. నీ నోరు కంట్రోల్ లో ఉండదు. ఏది పడితే అది మాటలు ఆడుతావు. నీకు నాకు మంచి రాపో లేనప్పుడు నా మీద జోక్స్ ఎలా వేస్తావని సోనియా విష్ణు ప్రియను అంది. దీంతో విష్ణు ప్రియా.. అడల్ట్ అనేది నీ బుర్రలో ఉంది. అందుకే నీకు అలా ఉంది. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సోనియాని అంది. దీంతో సోనియా రెచ్చిపోయి విష్ణు ప్రియాని మాటలతో బాధ పెట్టింది. రోజూ నేను అడల్ట్ గురించి మాత్రమే వింటాను. నీకు సరిగ్గా బట్టలు వేసుకోవడం రాదు, అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల చాలా మంది హౌస్ లో అన్ కంఫోర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. ఆ విషయం తెలిసిన కూడా మళ్లీ వాళ్ల దగ్గరకే వెళ్తున్నావని విష్ణు ప్రియని అంది. ఇంతటితో ఆపకుండా.. నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్న నీకు పర్లేదు. మేం ఇలాంటివి చేస్తే మా ఫ్యామిలీ ఊరుకోరు అని పెద్ద మాటలు అంది. దీంతో సోనియాపై వ్యతిరేకత పెరిగింది. విష్ణు ప్రియా ఫ్యాన్స్ సోనియాపై మండి పడుతున్నారు. ఒక ఆడది అయి ఉండి.. ఇంకో ఆడదాన్ని ఇలాంటి మాటలు అనడం కరెక్ట్ కాదని అంటున్నారు. సోనియాకి నోటి దురద చాలా ఎక్కువ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హౌస్ లో ఇలా నోటికి ఏం వస్తే అది మాట్లాడితే.. తొందరిలోనే బయటకు రావడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. మరి మీరు రోజూ బిగ్ బాస్ చూస్తున్నారా.. మీకు సోనియా ప్రవర్తన ఎలా అనిపిస్తుందో మరి కామెంట్ చేయండి.