https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ప్రేరణ మాస్కులు మొత్తం పీకేసిన సీత..రోహిణి పై కపట ప్రేమని ప్రేరణ నోటితోనే చెప్పించేసిందిగా!

నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, సహాయం చేసిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం, మెగా చీఫ్ గా హౌస్ ని మ్యానేజ్ చేయమని పవర్స్ ఇస్తే, ఆ పవర్స్ ని ఉపయోగించుకొని ఒక డిక్టేటర్ లాగా వ్యవహరించడం, ఇలా ఎన్నో చెడు లక్షణాలు గత నాలుగు వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం.

Written By: Vicky, Updated On : November 20, 2024 8:48 am
Bigg Boss Telugu 8(228)

Bigg Boss Telugu 8(228)

Follow us on

Bigg Boss Telugu 8: కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది, ఒకానొక దశలో మొట్టమొదటి బిగ్ బాస్ లేడీ టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని భావించిన కంటెస్టెంట్ ప్రేరణ. ఆరంభంలో ఆమె ఆట తీరు అలా ఉండేది. మగవాళ్ళతో సమానంగా, తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించి ఆడపులి అని కూడా అనిపించుకుంది. అలాంటి కంటెస్టెంట్ నేడు డేంజర్ జోన్ లోకి వచ్చి, ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు సోషల్ మీడియా లో చెప్తున్న మాటలు ఇప్పుడు ప్రేరణ అభిమానుల్లో కాస్త గుబులు పుట్టిస్తుంది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమెకు, యష్మీ, పృథ్వీ లకు ఓటింగ్ లో చాలా తక్కువ తేడా ఉంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు. ప్రేరణ గ్రాఫ్ ఈ స్థాయిలో పడిపోవడానికి ముఖ్య కారణం, ఆమె ప్రవర్తనే.

నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, సహాయం చేసిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం, మెగా చీఫ్ గా హౌస్ ని మ్యానేజ్ చేయమని పవర్స్ ఇస్తే, ఆ పవర్స్ ని ఉపయోగించుకొని ఒక డిక్టేటర్ లాగా వ్యవహరించడం, ఇలా ఎన్నో చెడు లక్షణాలు గత నాలుగు వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు సీత ప్రేరణ నోటితోనే నిజం చెప్పి, ఇన్ని రోజులు మ్యానేజ్ చేస్తూ వచ్చిన మాస్కులను విప్పేసింది. సీత మాట్లాడుతూ ‘రోహిణి కి ఏవిక్షన్ పాస్ ఇవ్వడంలో నువ్వు విశ్వాసం చూపించినట్టు కేవలం నటించావు అని మాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు మెగా చీఫ్ అవ్వడానికి కారణం రోహిణి నీ చేతికి సూట్ కేసు ఇవ్వడం వల్లే. ఆమెకి ఏవిక్షన్ పాస్ అవసరం అనే విషయం నీకు కూడా తెలుసు, కానీ నువ్వు సహాయం చేసినట్టే చేసి నబీల్ కి వచ్చేలా చేసావు’ అని అంటుంది సీత.

దీనికి ప్రేరణ సమాధానం చెప్తూ ‘నాకు రోహిణి తో పాటు నబీల్ కి కూడా సహాయం చేయాలనీ మనసులో ఉన్నింది. ముందుగా ఆమె నేను మెగా చీఫ్ అవ్వడానికి కారణం అయ్యినందుకు విశ్వాసం చూపిస్తూ ఒక వోట్ వేసాను. రెండవ ఓటు వేసే అవకాశం వచ్చినప్పుడు నబీల్ కి వేసాను’ అని అంటుంది. అప్పుడు సీత ‘నువ్వు విశ్వాసం చూపించాలి అనుకుంటే, రోహిణికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి కదా, ఇది ఆమెకు సహాయం చేసినట్టు ఏ కోణంలో నీకు అనిపించింది’ అని అడుగుతుంది. దానికి ప్రేరణ సమాధానం చెప్తూ ‘నా బుర్రలో మొదటి నుండి నబీల్ కి సపోర్ట్ చేయాలని ఉన్నింది. కానీ రోహిణి అవకాశం వస్తే నాకు సహాయం చెయ్యి అని అనడంతో, నా మొదటి ఓటు ఆమెకి వేసాను’ అని అంటుంది. అప్పుడు సీత ‘నువ్వు రోహిణికి సహాయం చెయ్యాలని మనస్ఫూర్తిగా అనుకోలేదు. కేవలం ఆమె అడిగింది అనే ఒక ఓటు వేశావు..అంతే కదా?’ అని సీత అడగగా, ప్రేరణ అవును అని ఒప్పుకుంటుంది. అప్పుడు సీత రోహిణి తో మాట్లాడుతూ ఇదమ్మా ఈమె నిజస్వరూపం అన్నట్టుగా చెప్తుంది.