Bigg Boss Telugu 8: మొన్న బిగ్ బాస్ హౌస్ లో మొదలైన నామినేషన్స్ ప్రక్రియ, నిన్నటి వరకు కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఉన్న టాప్ 10 కంటెస్టెంట్స్ లో 5 మందిని నామినేట్ చేసి వెళ్లారు. సోమవారం ఎపిసోడ్ లో సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా రాగా, మంగళవారం ఎపిసోడ్ లో నైనికా, సీత, ఆదిత్య ఓం, నాగ మణికంఠ వచ్చారు. వీరిలో సీత నామినేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. ఆమె యష్మీ,ప్రేరణ ని నామినేట్ చేసింది. ఇద్దరినీ మంచి పాయింట్స్ తోనే నామినేట్ చేసింది కానీ, యష్మీ విషయంలో ఆమె నిఖిల్ పై వేసిన దారుణమైన నిందలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం రేపింది. పాపం నిఖిల్ ఆమె వేసిన నిందలు తీసుకోలేక ఏడుస్తూ, అన్నం తినకుండా పడుకుంటాడు. అసలు ఏమి జరిగిందో పూర్తిగా ఈ విశ్లేషణలో చూద్దాం.
సీత యష్మీ ని నామినేట్ చేస్తూ ‘మొదట్లో ఉన్న యష్మీ, ఇప్పుడు నాకు కనిపించడం లేదు. నువ్వు నిఖిల్ ట్రాప్ లో పడ్డవాని నాకు అనిపించింది. ఇప్పుడు యష్మీ గురించి ఏమైనా చూద్దాం అనుకుంటే, నీతో పాటు నిఖిల్ ని కూడా చూడాల్సి వస్తుంది. అంతలా అతనికి దాసోహం అయ్యావు. అతనికి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, దయచేసి అర్థం చేసుకొని నీ గేమ్ నువ్వు ఆడు’ అని అంటుంది సీత. అప్పుడు నిఖిల్ వెంటనే కలగచేసుకొని ‘ట్రాప్ లో పడేయడం ఏమిటి?’ అని అడుగుతాడు. అప్పుడు సీత దానికి సమాధానం చెప్తూ ‘మగవాళ్ళతో సమానంగా గేమ్స్ ఆడే స్ట్రాంగ్ అమ్మాయిలను ట్రాప్ లో పడేసి, వాళ్ళ గేమ్ ని డౌన్ చేసి, వాళ్ళని బలహీనపరుస్తున్నావు. సోనియా నుండి యష్మీ వరకు అదే చేసావు. దాని వల్ల నీ గేమ్ పై ఎలాంటి ప్రభావం పడలేదు, యష్మీ గేమ్ నాశనం అయ్యింది’ అని అంటుంది.
దీనికి నిఖిల్ మాట్లాడుతూ ‘ఇది చాలా తప్పు మాటలు. ఒకరిని ప్రభావితం చేస్తే, ప్రభావితులయ్యే అమాయకమైన అమ్మాయిలు ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను దీనిని తీసుకోలేను’ అని అంటాడు నిఖిల్. నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా నిఖిల్ సీత మాట్లాడిన మాటలను తల్చుకుంటూ బాధపడతాడు. అమ్మతోడు, సీతని ని బయటకి వెళ్లిన తర్వాత అసలు క్షమించను, నేనెప్పుడు అమ్మాయిలను ట్రాప్ లో పడేసాను రా?, యష్మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని, ఆమెని దూరం పెడితే, దానికి యష్మీ బాధపడి కనీసం నన్ను స్నేహితురాలిగా అయిన చూడు అంటేనే కదరా నేను ఆమెతో బాగున్నాను. ఇది సీత కి కనిపించలేదా? అంత పెద్ద మాట ఎలా అనింది? అంటూ పృథ్వీ తో చెప్పుకొని బాధపడతాడు. ఆ బాధలో కనీసం అన్నం కూడా తినకుండా అలాగే పడుకుంటాడు. పక్కరోజు కెమెరాలతో నేను ఈ నిందని తీసుకోలేకపోతున్నాను, నన్ను పంపించేయండి బిగ్ బాస్ అని అన్నాడట నిఖిల్. ఇది చూసిన పృథ్వీ అతనికి సర్దిచెప్పి, హౌస్ లో ఉండిపోయేలా చేసాడట. అదే రోజున యష్మీ కూడా సీత చేసిన కామెంట్స్ ని తిరస్కరిస్తూ, తనతో నిఖిల్ ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది.