https://oktelugu.com/

Bigg Boss Telugu 8: రహస్యంగా నబీల్ చెవిలో బయట పరిస్థితిని వివరించిన మణికంఠ..నామినేషన్స్ చేయమంటే హితబోధ చేసాడు!

నామినేషన్ లాగా ఎవరికీ అనిపించలేదు, బయట వాళ్ళ ఆట తీరుకి వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్తూ, జాగ్రత్తగా ఆడండి అని హితబోధ చేసి వెళ్లినట్టుగా అనిపించింది. ముందుగా మణికంఠ నిఖిల్ ని నామినేట్ చేస్తూ 'మొదటి రెండు వారాలు కనిపించిన నిఖిల్, మళ్ళీ కనిపించడం లేదు.

Written By: Vicky, Updated On : November 20, 2024 8:53 am
Bigg Boss Telugu 8(229)

Bigg Boss Telugu 8(229)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మన అందరికీ నామినేషన్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాగ మణికంఠ. నామినేషన్స్ సమయంలో మణికంఠ ఎదురుగా ఉన్నాడంటే, ప్రత్యర్థులకు కాస్త భయమే. మధ్యలో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తనకి తాను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళిపోయాడు కానీ, ఆయన అలాగే కొనసాగి ఉండుంటే టాప్ 5 వరకు వచ్చేవాడు, బోలెడంత కంటెంట్ కూడా దొరికేది. మణికంఠ ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు అనేది వాస్తవం. అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లోపలకు వచ్చి ప్రస్తుతం ఉన్న టాప్ 10 కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసే ప్రక్రియ ని బిగ్ బాస్ ఈ సీజన్ లో సరికొత్తగా ప్రవేశ పెట్టాడు. ఈ ప్రక్రియ లో మంగళవారం ఎపిసోడ్ లో నాగ మణికంఠ హౌస్ లోకి అడుగుపెట్టి నిఖిల్, నబీల్ ని నామినేట్ చేసి వెళ్తాడు.

ఇది నామినేషన్ లాగా ఎవరికీ అనిపించలేదు, బయట వాళ్ళ ఆట తీరుకి వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్తూ, జాగ్రత్తగా ఆడండి అని హితబోధ చేసి వెళ్లినట్టుగా అనిపించింది. ముందుగా మణికంఠ నిఖిల్ ని నామినేట్ చేస్తూ ‘మొదటి రెండు వారాలు కనిపించిన నిఖిల్, మళ్ళీ కనిపించడం లేదు, నెమ్మదిగా గ్రాఫ్ పడిపోయిందని అప్పట్లో నేను ఏదైతే చెప్పానో అది నిజమే అని ఇంటికి వెళ్లి ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నువ్వు కనెక్షన్స్ పెట్టుకోడానికి వచ్చావా, గేమ్ ఆడదానికి వచ్చావా అనే క్లారిటీ నీకు కూడా లేకపోతే ఈ టైటిల్ ని గెలవడం నీకు చాలా కష్టం నిఖిల్. మొన్న జరిగిన పానీ పట్ యుద్ధం టాస్కులో చాలా అగ్రెసివ్ గా ఆడావు, మళ్ళీ లోపలకి వెళ్లిన తర్వాత ఎమోషనల్ అయ్యావు. ఏది నిజమైన నిఖిల్ అనేది నాకు అర్థం కావడం లేదు. ఈ మాస్కులు తీసేసి, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట మాట్లాడకుండా, నేరుగా ఒకేలా గేమ్ ఆడితే నీకు మంచిది, నీ మంచి కోసమే చెప్తున్నా’ అని అంటాడు.

దానికి నిఖిల్ పెద్దగా ఏమి డిఫెండ్ చేసుకోకుండా సరే ఇక నుండి మార్చుకొని బాగా ఆడుతాను అని అంటాడు. ఇక ఆ తర్వాత రెండవ నామినేషన్ ని నబీల్ కి వేస్తూ ‘ మొదట్లో షేర్ లాగా ఆడుతున్నట్టు అనిపించిన నబీల్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత ఎందుకో నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపించింది’ అని అంటాడు మణికంఠ. దానికి నబీల్ సమాధానం చెప్తూ ‘ఏమో మామ, నన్ను ఎవ్వరూ నామినేట్ చేయడం లేదు. వాళ్ళ దగ్గర నాకు సంబంధించి పాయింట్స్ దొరకక నామినేట్ చేయట్లేదో, లేదా ఏదైనా స్ట్రాటజీ తో అలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’ అని అంటాడు. దానికి మణికంఠ సమాధానం చెప్తూ ‘నువ్వు ఆడితే కదా వాళ్లకి పాయింట్స్ వస్తాయి, ప్రతీ సందర్భంలోనూ నీ పాయింట్ పెట్టు’ అని అంటాడు. అలా పెడితే మధ్యలో సంబంధం లేకుండా ఎందుకు దూరుతున్నావ్ అంటారు మామ అని అంటాడు నబీల్. ఎవరు ఏమి అనుకుంటే నీకు ఎందుకు, నీ గేమ్ నువ్వు ఆడు అని అంటాడు. నబీల్ దానికి ఒప్పుకొని నువ్వు చెప్పినట్టే చేస్తా అని నామినేట్ అవుతాడు. ఆ తర్వాత మణికంఠ వెళ్ళేటప్పుడు నబీల్ ని హగ్ చేసుకొని చెవిలో ‘బయట నీ గ్రాఫ్ పడిపోతుంది..బాగా ఆడు’ అని పరోక్షంగా హింట్స్ ఇస్తాడు.