Bigg Boss Telugu 8 : టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో చాలా మంచి పేరునైతే సంతరించుకుంది. ఇక ఈ షో కోసం యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులందరూ చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 రానున్న నేపథ్యంలో చాలామంది కంటెస్టెంట్లు ఈసారి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఎలాగైనా సరే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలవాలనే దృక్పథంతో ఆయన ఈ షో లో పాల్గొంటున్నారు. ఇక అందులో ముఖ్యంగా ఆదిత్య ఓం గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో హరికృష్ణ హీరోగా వచ్చిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో నటించిన ఈయన ఆ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇంకా ఆ తర్వాత తెలుగులో ‘ధనలక్ష్మి ఐ లవ్ యు’, ‘మీ ఇంటికి మా ఇంటికి వస్తే ఏం తెస్తారు’ లాంటి పలు రకాల సినిమాల్లో నటించినప్పటికీ అవి ఏవి పెద్దగా సక్సెస్ సాధించలేదు.
అయినప్పటికీ ఆయన తెలుగులో 25 సినిమాల వరకు నటించాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అలాంటి ఆదిత్య ఓం ఫ్యూచర్ లో స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకుంటే మధ్యలో ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నిజానికి అయినది ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆయన్ని చాలా అక్కున చేర్చుకున్నారు. తెలుగులో ఆయన ఫేడౌట్ అయిపోయిన తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించాడు.
ముఖ్యంగా డైరెక్షన్ కూడా చేశాడు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘బందూక్ ‘ అనే సినిమా చాలామంది విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అలాగే ‘మాస్సబ్ ‘ అనే సినిమా కూడా పలు రకాల జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో సందడి చేసింది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ఆయనకి సినిమాల్లో అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాడు…రెండు సంవత్సరాల పాటు బయట ఎక్కడ కనిపించకుండా తిరిగాడు. నిజంగా ఆదిత్య ఓం కష్టాలు వింటే ప్రతి ఒక్కరూ కండ్లు చెమ్మగిల్లుతాయనే చెప్పాలి. ఇక ఆదిత్య ఓం బాడీ గాని, ఆయన నటన గానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయినప్పటికీ ఆయనకు మంచి సినిమాలు పడకపోవడం వల్లే ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
48 ఏళ్ల వయసులో కూడా చాలా ఫిట్ గా కనిపిస్తున్న ఆదిత్య బిగ్బాస్ సీజన్ 8 విన్నర్ గా గెలిచి తన సత్తా చూపించాలని చూస్తున్నాడు. ఇక గత బిగ్ బాస్ సీజన్ కి వచ్చిన శివాజీ పెనుసంచలనాన్ని సృష్టించి ప్రస్తుతం సినిమాల్లో భారీ అవకాశాలను అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఆదిత్య ఓం కూడా శివాజీ బాటలోనే నడిచి మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో తను బిజీ అయిపోవాలని చూస్తున్నాడు…