HomeNewsBigg Boss Shobha Shetty: సీరియల్స్ మానేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శోభా శెట్టి......

Bigg Boss Shobha Shetty: సీరియల్స్ మానేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శోభా శెట్టి… నీకు తగ్గ వ్యాపారం అంటున్న జనాలు!

Bigg Boss Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శోభా శెట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. శోభా శెట్టి ఇటీవల తన లవర్ యశ్వంత్ రెడ్డి తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. చాలా సింపుల్ గా బంధువుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇక ప్రస్తుతం శోభా శెట్టి కి సీరియల్ ఆఫర్స్ లేకపోవడంతో కొత్త ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల సుమన్ టీవీ లో కాఫీ విత్ శోభా అనే ప్రోగ్రాం కి యాంకర్ గా మారింది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు .. మేకప్ అంటే నాకు చాలా గౌరవం, మేకప్ నాకు అన్నం పెట్టింది అంటూ చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు ఆ మేకప్ నే ఆదాయ వనరుగా మార్చుకోబోతుంది. ఈ నేపథ్యంలో శోభా ఓ మేకప్ స్టూడియో లాంచ్ చేయనుంది. బిగ్ బాస్ కి వెళ్లక ముందే SY స్టూడియోను స్టార్ట్ చేసిందట. బిగ్ బాస్ కి వెళ్లడం వలన ఇన్స్టిట్యూట్ లాంచ్ చేయలేక పోయిందట. ఇప్పుడు కొత్తగా మేకప్ స్టూడియో స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది.

ఇక ఈ ప్రొఫెషనల్ మేకప్ కోర్సులో భాగంగా 28 రోజుల ట్రైనింగ్ ఉంటుందని .. ఈ ట్రైనింగ్ లో కంప్లీట్ ప్రొఫెషనల్ మేకప్ నేర్పిస్తాం అని శోభా వెల్లడించింది. సర్టిఫికెట్ కూడా అందజేస్తాం అని చెప్పింది. కేవలం పది రోజుల్లోనే అన్ని రకాల మేకప్స్ తో పాటు హెయిర్ స్టైల్స్, ఫ్లవర్ మేకింగ్, డిజిటల్ మార్కెటింగ్ కూడా మేము చేయిస్తాం. సోషల్ మీడియా నుంచి బిజినెస్ ను ఎలా రాబట్టవచ్చు. వీడియోలు ఎలా తీసుకోవాలి. ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాం అని శోభా చెప్పుకొచ్చింది.

అయితే ఈ పని చేయడానికి సిగ్గు పడటం లేదని శోభా అంది. తాను మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి తనకు వచ్చిన పనిని పది మందికి నేర్పుతాను. ఫ్రీగా కాదు కానీ .. మేకప్ ఎలా చేయాలో నేర్పించడం కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాం అంటూ వివరాలు తెలియజేసింది. తన లాగే మేకప్ ఆర్టిస్టులు అవ్వాలి అనుకునేవాళ్లకు ఇది మంచి అవకాశం అంటూ శోభా చెప్పుకొచ్చింది.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version