https://oktelugu.com/

Devara Second Look: దేవర లో ఎన్టీయార్ సెకండ్ లుక్ చూస్తే తట్టుకోలేరు..

ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా గ్లింప్స్ చూస్తే అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : February 3, 2024 / 12:47 PM IST
    Follow us on

    Devara Second Look: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మాస్ ఆడియెన్స్ లో అయితే తన ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో ఆయన ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా గ్లింప్స్ చూస్తే అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. ఈ సినిమా లో ఊర మాస్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.ఇక ఇప్పటి వరకు మొదటి క్యారెక్టర్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ ని కూడా ఈ నెల రెండో వారంలో లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.

    మరి ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లలో నటిస్తున్న ఎన్టీఆర్ ప్రేక్షకులలో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్న క్రమంలో మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అయితేనే రెండో పార్ట్ ను తెరకెక్కించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ క్రమంలో కొరటాల ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకొని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

    మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ తన ఖాతాలో మరో భారీ హిట్ ను వేసుకోబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా హై రేంజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అనే విషయం కూడా మనకు చాలా స్పష్టం గా తెలుస్తుంది…