Atal Bimit Vyakti Kalyan Yojana: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కరోనా కష్ట కాలంలో ఉద్యోగాలను కోల్పోయిన వారికి ఊరట కలిగే విధంగా కీలక ప్రకటన చేసింది. అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన స్కీమ్ ను పొడిగిస్తున్నామని కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
2022 సంవత్సరం జూన్ నెల వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. ఎవరైతే కరోనా సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయి ఉంటారో వాళ్లు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఉపాధి కోల్పోయిన వాళ్లు కేంద్రం నుంచి అలవెన్స్ ను పొందవచ్చు. 185వ ఈఎస్ఐసీ మీటింగ్‌లో ఈ స్కీమ్ గడువును పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఎవరైతే ఉపాధిని కోల్పోయి ఉంటారో వాళ్లకు ఈఎస్‌ఐ నుంచి ఆర్థిక సహాయం లభించే అవకాశాలు ఉంటాయి.
ఈఎస్‌ఐ ఆరు నెలల వరకు మెడికల్ ఫెసిలిటీని అందించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈఎస్ఐ లబ్ధిదారులు ఉద్యోగాన్ని కోల్పోయిన పక్షంలో ఈ స్కీమ్ ద్వారా వేతనంలో సగం డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుంది. మూడు నెలల వరకు ఈ విధంగా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. మూడు నెలలలో ఉద్యోగం సంపాదించుకుంటే మళ్లీ ఎలాంటి ఇబ్బందులు కలగవు.
నిరుద్యోగులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల భారీగా ప్రయోజనం చేకూరనుంది. లాక్ డౌన్ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.