NIOT Recruitment 2021: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 237 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్యలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
పది, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆగష్టు 20వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 28 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
18,000 నుంచి 78,000 రూపాయల వరకు వేతనం లభిస్తుండటంతో నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది. https://www.niot.res.in/niot1/recruitment.php వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది