pakistan vs india : భీకరమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ తేలిపోయాడు. సత్తా చూపిస్తాడనుకున్న గిల్ విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ దారుణంగా తేలిపోయాడు. సంజు జట్టుకు అవసరమైన సందర్భంలో విఫలమైన షాట్ కొట్టి నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు. ఈ దశలో టీమిండియా కు ఆపద్బాంధవుడుగా నిలిచాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. కష్టకాలంలో జట్టుకు వెన్నెముకగా నిలిచి అదరగొట్టాడు. తద్వారా మరోసారి టీమిండియా ఆసియా కప్ గెలవడానికి తన వంతు కృషి చేశాడు.
#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvPAK pic.twitter.com/D6xOiApFEv
— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2025
పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోతున్న వేళ.. మైదానంలో కీలకమైన వికెట్లు పడగొడుతున్న వేళ.. ఏ మాత్రం భయపడకుండా.. ఏమాత్రం వెన్ను చూపించకుండా బ్యాటింగ్ చేశాడు తిలక్ వర్మ. 53 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 63* పరుగులు చేసి.. టీమిండియాకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసి అదరగొట్టాడు తిలక్ వర్మ. పిచ్ పై బంతి దూసుకు వస్తున్న వేళ.. అత్యంత ఖచ్చితత్వంతో బ్యాటింగ్ చేసి సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా నాలుగో వికెట్ కు సంజు తో కలిసి 57 పరుగులు, ఐదో వికెట్ కు శివం దుబే తో కలిసి 60 పరుగులు జోడించి.. భారత జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. అంతేకాదు భారత జట్టుకు ఐదు వికెట్ల తేడాతో గెలుపును కూడా దక్కించాడు.
ఈ విజయం ద్వారా పాకిస్తాన్ జట్టుపై భారత్ హ్యాట్రిక్ గెలుపులను నమోదు చేసింది. ఆసియా కప్ లో లీగ్ దశలో, సూపర్ ఫోర్ దశలో, చివరికి ఫైనల్లో కూడా విజయాన్ని దక్కించుకొని టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు 2017 నాటి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఓటమికి సరైన బదులు తీర్చుకుంది. వాస్తవానికి 2017 తర్వాత టీమిండియా, పాకిస్తాన్ ఐసీసీ మెగా టోర్నీలలో ఫైనల్ మ్యాచ్లో తలపడలేదు. 2017 తర్వాత అంటే దాదాపు 8 సంవత్సరాల అనంతరం వచ్చిన అవకాశాన్ని టీమిండియా అద్భుతంగా వినియోగించుకుంది. గెలుపుతో టోర్నీని ముగించింది. తద్వారా ఆసియా కప్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్ దక్కించుకున్న టీమిండియా.. తాజా ట్రోఫీతో కలిసి.. 9సార్లు ఆసియా విజేతగా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది.