IND vs PAK : ఆటను ఆటలాగా చూడాలి. ఆటగాళ్లు ఆటను మాత్రమే ఆడాలి. అలాకాకుండా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇచ్చే ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్లేయర్లు భారత జట్టుతో క్రికెట్ ఆడుతున్నప్పుడు క్రికెట్ మాత్రమే ఆడాలి. అలా కాకుండా ఎక్కువ తక్కువ చేస్తే ఆ తర్వాత మక్కెలు ఇరుగుతాయి. ఇలాంటి సంకేతాన్నే టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా పాకిస్తాన్ ప్లేయర్ ఒకడికి రుచి చూపించాడు. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చేలా చేశాడు.
ఇటీవల ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఆకాశమేహద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. అతని బ్యాటింగ్ స్టైల్ చూసి పాకిస్తాన్ ప్లేయర్లు గొడవకు దిగారు. ముఖ్యంగా రౌఫ్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. మైదానంలో భారత అభిమానులను ఉద్దేశించి విచిత్రమైన సంకేతాలు చేశాడు. రఫెల్ కూల్చాం అన్నట్టుగా చేతివేళ్లతో 6 -0 సంకేతాలు ఇచ్చాడు. దీనిపై భారత్ ఏకంగా ఐసిసికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫీజులో 30% కోత విధిస్తూ ఐసిసి నిర్ణయం తీసుకుంది.
రౌఫ్ అతి ప్రవర్తనను మనసులో పెట్టుకున్న టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా ఫైనల్ మ్యాచ్లో గట్టి రిప్లై ఇచ్చాడు.. రౌఫ్ వికెట్ పడగొట్టిన అనంతరం.. చేతితో విమానం కూలిపోయింది అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. దీంతో రౌఫ్ తలవంచుకుని వెళ్ళిపోయాడు. బుమ్రా రౌఫ్ ను ఉద్దేశించి చేసిన సంకేతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. బుమ్రా పై భారత అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ కు తిక్క కుదిరిలా చేశావంటూ బుమ్రా కు కితాబిస్తున్నారు.
Bumrah celebration against Rauf
Giving it back . pic.twitter.com/TsqJ4J9Gbx
— S.Bhai33 (@HPstanno1) September 28, 2025