https://oktelugu.com/

Financial Problem: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఉప్పుతో ఇలా చేయండి..

ఉప్పుతో ఇంటిని తుడవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది అంటారు నిపుణులు. ఉప్పుకు సంబంధించిన చాలా రకాల చిట్కాలను ఇప్పటికే తెలుసుకున్నాం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 30, 2024 / 10:51 AM IST

    Financial Problem

    Follow us on

    Financial Problem: వాస్తు ప్రకారం ఉప్పుకు చాలా ప్రత్యేకమైన స్థానం, ప్రాధాన్యత ఉంటుంది. దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చాలా మందికి ఉప్పుతో జిస్టి కూడా తీస్తుంటారు. ఇక వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమికొడుతారు. ఇక పూర్వం నుంచి ఉప్పును లక్ష్మీదేవి తో పోలుస్తారు. అందుకే ఉప్పుకు కాలు తాకించవద్దు అంటారు. అంతేనా ఉప్పును చేతితో మరొకరికి ఇవ్వద్దు అంటారు పెద్దలు. ఇలా ఇవ్వడం వల్ల లక్ష్మీ దేవిని మరొకరికి ఇచ్చినట్టు నమ్ముతారు.

    ఉప్పుతో ఇంటిని తుడవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది అంటారు నిపుణులు. ఉప్పుకు సంబంధించిన చాలా రకాల చిట్కాలను ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. అయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలిగిపోతాయి అంటారు వాస్తు నిపుణులు. అంతేకాదు ఇలా కట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుందట.

    వైవాహిక సమస్యలు కూడా ఇలా చేయడం వల్ల తొలిగిపోతాయి. ఇంటి యజమాని జాతకంలో శుక్ర దోషాలు కూడా పోతాయి అంటారు నిపుణులు. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగానే బయట పడవచ్చు. అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పును కట్టడం వల్ల అప్పుల నుంచి బయట పడి ఆర్థికంగా మెరుగు పడవచ్చు అంటారు వాస్తు నిపుణులు. ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు ఉంటాయట. గొడవలు, కలతలు ఉంటే కూడా తొలిగిపోతాయట. మరి తెలుసుకున్నారు కదా కేవలం ఇంటి ప్రధాన ద్వారానికి కాస్త ఉప్పు కట్టండి మీ ఇంట్లో ఆనందాల హరివిల్లును నెలకొల్పండి.