https://oktelugu.com/

Prabhas’ Spirit: ప్రభాస్ స్పిరిట్ పై క్రేజీ అప్డేట్… ఆ ఇద్దరు స్టార్ లేడీస్ ని ఎంపిక చేసిన సందీప్ రెడ్డి వంగ!

స్పిరిట్ అనే టైటిల్ తో ప్రభాస్ తో మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్న సందీప్ మరి కొద్ది రోజుల్లో షూటింగ్ మొదలు పెట్టనున్నాడని సమాచారం.

Written By:
  • S Reddy
  • , Updated On : April 30, 2024 / 10:42 AM IST

    Crazy update on Prabhas spirit

    Follow us on

    Prabhas’ Spirit: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరో హిట్ అందుకున్నాడు. గత ఏడాది విడుదలైన యానిమల్ తో భారీ విజయం అందుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

    స్పిరిట్ అనే టైటిల్ తో ప్రభాస్ తో మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్న సందీప్ మరి కొద్ది రోజుల్లో షూటింగ్ మొదలు పెట్టనున్నాడని సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2829 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అలాగే దర్శకుడు మారుతితో రాజా సాబ్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

    స్పిరిట్ మూవీ కోసం సందీప్ రెడ్డి వంగ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారట. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమా ఉండాలని దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్నాడట. ప్రస్తుతం హీరోయిన్స్ కోసం ఆయన సెర్చ్ చేస్తున్నారట. హీరోయిన్స్ వేటలో ఉన్న సందీప్ రెడ్డి వంగ… రష్మిక మందాన, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.అయితే ఆయన ఓ బాలీవుడ్ భామతో పాటు సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ ని ఎంపిక చేశారట.

    హీరోయిన్ కియారా అద్వానీ .. స్పిరిట్ లో ప్రభాస్ కి జంటగా చేయబోతోందని టాక్. మరో హీరోయిన్ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఇక తన గత చిత్రాల మాదిరి హీరో ప్రభాస్ రోల్ చాలా వైలెంట్ గా ఉంటుందని సందీప్ రెడ్డి వంగ తెలియజేశారు.