https://oktelugu.com/

Madhya Pradesh: ఏప్రిల్‌ ఫూల్‌ చేద్దామనుకున్నాడు.. కానీ చివరకు..!

ఇండోర్‌కు చెందిన అభిషేక్‌(18) ఇంటర్‌ చదువుతున్నాడు. ఫ్రాంక్‌ చేసి తన ఫ్రెండ్‌ను ఫూల్‌ చేద్దామనుకున్నాడు. ఈమేరకు తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అభిషేక్‌ ఫ్యాన్‌కు తాగు బిగించి, స్టూల్‌పై నిలబడి ఫ్రెండ్‌కు వీడియోకాల్‌ చేశాడు.

Written By: , Updated On : April 3, 2024 / 10:01 AM IST
Madhya Pradesh

Madhya Pradesh

Follow us on

Madhya Pradesh: ఏప్రిల్‌ 1 సందర్భంగా ఫ్రెండ్‌ను ఫూల్‌ చేద్దామని భావించిన ఓ విద్యార్థి సూసైడ్‌ చేసుకుంటున్నట్లు వీడియో తీసుకున్నాడు. కానీ, అనూహ్యంగా చివరకు అతడు ప్రాణాలో కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.

ఇంటర్‌ విద్యార్థి..
ఇండోర్‌కు చెందిన అభిషేక్‌(18) ఇంటర్‌ చదువుతున్నాడు. ఫ్రాంక్‌ చేసి తన ఫ్రెండ్‌ను ఫూల్‌ చేద్దామనుకున్నాడు. ఈమేరకు తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అభిషేక్‌ ఫ్యాన్‌కు తాగు బిగించి, స్టూల్‌పై నిలబడి ఫ్రెండ్‌కు వీడియోకాల్‌ చేశాడు. తాను చనిపోతున్నానని బెదిరించాడు. తర్వాత సూసైడ్‌ గురించి వారిద్దరూ మాట్లాడుకున్నారు.

ఒక్కసారిగా ఉరి..
ఈ క్రమంలో అభిషేక్‌ నిల్చున్న స్టూల్‌ ఒక్కసారిగా పక్కకు పడిపోయింది. ఉరితాడు అభిషేక్‌ మెడకే ఉండడంతో అది బిగుసుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అభిషేక్‌ ఫ్రెండ్‌ వెంటనే అతని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రక్షించాలని కోరాడు. అయితే అభిషేక్‌ తల్లిదండ్రులు రూంకి వచ్చి ఉరి తప్పించి ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి చేరేలోపే అభిషేక్‌ ప్రాణం పోయింది.

ఆలస్యంగా వెలుగులోకి..
ఈ ఘటన ఏప్రిల్‌ 1న జరిగింది. కానీ ఆలస్యంగా బయటకు వచ్చింది. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ కుమారుడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సోషల్‌ మీడియా పిచ్చి…
పుర్రెకో బుద్ధి అన్నట్లు ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్లు వచ్చాక సోషల్‌ మీడియాలో లైక్స్, షేర్స్‌ కోసం యువత ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కొందరు తెలివిగా ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంటే.. మరికొందరు ఇలాంటి తెలివి తక్కువ పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.