https://oktelugu.com/

Mahesh Babu: అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న మహేష్ బాబు నయా లుక్…’నీ ఏజ్ ఎంతన్నా ‘…

ఇప్పటికీ కూడా ఆయన ఫుడ్ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మహేష్ బాబు లాంటి అందమైన హీరో ఇండస్ట్రీ లో మరొకరు లేరనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : April 3, 2024 / 10:19 AM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాని చేయబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు తమ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబుని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడు అనే ఆసక్తికరమైన సందేహాలు కూడా మహేష్ అభిమానుల్లో కలుగుతున్నాయి.

    ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు లుక్కు కు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ బాబు తను దిగిన కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనివల్ల ఈ ఫోటోల మీద అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి అయితే కలుగుతుంది. అయితే రాజమౌళి సినిమా కోసమే తను ఇలాంటి మేకోవర్లో కనిపిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు ‘అన్న నీకు 48 సంవత్సరాలు అంటే ఎలా నమ్మేది’ అంటూ ఆ ఫోటోల కింద కామెంట్లు పెడుతున్నారు. నిజానికి మహేష్ బాబుకు ప్రస్తుతం 48 సంవత్సరాలు అయినప్పటికీ తను 25 సంవత్సరాల యంగ్ కుర్రాడులా కనిపిస్తూ ఉండడం విశేషం…

    ఇక ఇప్పటికీ కూడా ఆయన ఫుడ్ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మహేష్ బాబు లాంటి అందమైన హీరో ఇండస్ట్రీ లో మరొకరు లేరనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియాలో ఒక సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

    ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కనుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గుంటూరు కారం ‘ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దానివల్లే ఇప్పుడు చేయబోయే సినిమా మీద భారీ కసరత్తులను చేస్తూ ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా చేస్తుంది రాజమౌళి కాబట్టి మహేష్ బాబు చాలా ధైర్యంగా ఈ సినిమాని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి 1000 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…