Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ ని రావొద్దు అని చెప్పినా వచ్చాడని, థియేటర్ లోకి ఆయన వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోయింది అనే విషయం చెప్తే, అతను పట్టించుకోకుండా సినిమా చూశాడని, వెళ్ళేటప్పుడు కూడా ఆయన ప్రోటోకాల్స్ ని పాటించకుండా మళ్ళీ కార్ రూఫ్ పైకి లేచి అభిమానులకు అభివాదం చేసాడని, సినీ ఇండస్ట్రీ కూడా అతనికి ఎదో జరిగిపోయినట్టు అందరూ ఇంటికి వెళ్లి సానుభూతి వ్యక్తపరిచారు కానీ, హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ ని ఒక్కరు కూడా కలవలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అల్లు అర్జున్ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘నేను శ్రీతేజ్ కి , రేవతి గారికి అలా జరిగిందనే విషయం తెలుసుకొని, వెంటనే హాస్పిటల్ కి వెళ్లాలని మొండికేసాను. మా బన్నీ వాసు నన్ను ఆపేందుకు చాలా ప్రయత్నం చేసాడు. ఇప్పటికే చాలా జరిగింది. మళ్ళీ మీరు అక్కడికి వెళ్లడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. దయచేసి వద్దు, ఆ కుటుంబ సభ్యులు కూడా మీ మీద కేసు వేశారు. కలవడానికి వీలు కూడా ఇప్పుడు లేదని చెప్పాడు. కానీ నేను మూర్ఖంగా మాట్లాడాను, అక్కడికి వెళ్తాను అని మొండికేసాను, కానీ చివరికి నన్ను కంట్రోల్ చేసి ఆపారు. నేను శ్రీతేజ్ ని, రేవతి ని పట్టించుకోలేదని నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారక్టర్ ని బ్యాడ్ చేస్తున్నారు. నాపై కామెంట్స్ చేసిన వాళ్లకు సరైన సమాచారం అంది ఉండదు. అందుకే ఇదంతా జరిగి ఉండొచ్చు, ఇందులో ఎవరి తప్పు లేదు’ అని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘చిరంజీవి గారి అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, నేను ఎంతో మనస్తాపానికి గురై ఆ కుటుంబాలకు డబ్బులు విరాళం అందించిన వాడిని నేను. విజయవాడ లో చిరంజీవి గారి అభిమాని చనిపోతే నేనే అక్కడికి వెళ్లి ఆర్ధిక సాయం అందించాను. అలాంటి నేను నా అభిమానులను ఎంత ప్రేమిస్తానో మీ అందరికీ తెలుసు. నేనెలా అలా అమర్యాదగా ప్రవర్తిస్తాను. ఇది నన్ను చాలా బాధ కి గురి చేసింది. కేసు కోర్టు లో ఉంది కాబట్టి దీనిపై ఇంతకు ఇంచి నేను మాట్లాడలేను’ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అల్లు అరవింద్, అల్లు అర్జున్ తరుపున న్యాయవాది కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Allu arjuns emotional comments my family stopped me from going to the hospital
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com