
ముంబై లోని యావత్మాల్ జిల్లా లో శానిటైజర్ తాగి ఏడుగురు చనిపోయారు. జిల్లాలోని వణీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు శానిటైజర్ తాగిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. లాక్ డౌన్ కారణంగా మద్యం లభించకపోవడంతో వీరంతా శానిటైజర్ సేవించారని తెలిసింది. ఏడుగురిలో ముగ్గురు ఇంట్లోనే చనిపోగా మిగతావారు మాత్రం ఆసుపత్రిలో చేర్పించిన తరువాత చనిపోయారు.