Actress Sri Leela: జైలు రెస్టారెంట్‌ ప్రారంభించిన పెళ్లి సందD’హీరోయిన్…

Actress Sri Leela: టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత కావచ్చేమో ఇప్పుడు పరిచయం అయినా హీరోయిన్స్ అందరూ టాప్ హీరో పక్కన నటించడానికి సిద్ధమైపోతున్నారు. అయితే అదే బాటలో దూసుకుపోతున్నారు కృతి శెట్టి, పెళ్లి సందD’ శ్రీలీల. పెళ్లి సందD అంత హిట్ కాకపోయినా ఆ సినిమా హీరోయిన్ కి మాత్రం సినిమా అవకాశాలు బాగానే అందుకుంటుంది. పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు శ్రీలీల తన అందంతో నటనతో యూత్ ని ఫిదా […]

Written By: Raghava Rao Gara, Updated On : November 15, 2021 9:33 pm
Follow us on

Actress Sri Leela: టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత కావచ్చేమో ఇప్పుడు పరిచయం అయినా హీరోయిన్స్ అందరూ టాప్ హీరో పక్కన నటించడానికి సిద్ధమైపోతున్నారు. అయితే అదే బాటలో దూసుకుపోతున్నారు కృతి శెట్టి, పెళ్లి సందD’ శ్రీలీల. పెళ్లి సందD అంత హిట్ కాకపోయినా ఆ సినిమా హీరోయిన్ కి మాత్రం సినిమా అవకాశాలు బాగానే అందుకుంటుంది.

పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు శ్రీలీల తన అందంతో నటనతో యూత్ ని ఫిదా చేశారు ఈ భామ. ఈ సినిమాలో తన నటనకి తన డాన్స్ కానీ మంచి రెస్పాన్స్ లభించిన తరుణంలో స్టార్ హీరోలతో కూడా జతకట్టనుంది శ్రీలీల. ప్రస్తుతం రవితేజ ధమాకా సినిమాలో
నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమెకు మరిన్నీ ఆఫర్లు వస్తున్నాయని 3 నుంచి 4 సినిమాల్లో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. అంతే గాక ఓ మెగా హీరో సినిమా ఆఫర్‌ కూడా శ్రీ లీలాకు వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ భామ కొన్ని షోరూం కి రెస్టారెంట్ కి రిబ్బన్ కటింగ్ కి ఆహ్వానితులు అవుతున్నారు. ప్రస్తుత కాలంలో విభిన్నమైన స్టైల్స్ తో రెస్టారెంట్స్ ఏర్పడుతున్నాయి అందులో భాగంగా చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ” థీమ్‌ మండి రెస్టారెంట్‌” పెళ్లి సందD’ ముద్దుగుమ్మ శ్రీలీల ఈ ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌లో మొత్తం జైలు వాతావరణం ఉండేలా..ఫన్నీగా తీర్చిదిద్దారు అధిపతులు.అటు సినిమాలతో ఇటు రిబ్బన్ కటింగ్ తో బిజీ అయిపోయారు ఈ అమ్మడు.