Acer Swift Air 14 laptop: కొత్తగా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవారికి Acer సర్ ఫ్రైజ్ న్యూస్ తెలిపింది. ఈ కంపెనీ నుంచి కొత్తగా Swift Air 14 ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వచ్చింది. ఇది తేలికైన, స్లిమ్ డిజైన్‌తో ఉండి… రోజువారీ పనులు, చదువు, స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, వీడియో కాల్స్ వంటి అవసరాలకు బాగా ఉపయోపడేవిధంగా రూపొందించారు. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం..
ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ సిరీస్ 3 ప్రాసెసర్ వాడారు. అలాగే AI పనుల కోసం built-in NPU కూడా ఇచ్చారు. అంటే సాధారణ పనులతో పాటు AI-ఆధారిత ఫీచర్స్ ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా చూస్తే.. ఇందులో Swift Air 14 చాలా లైట్ వెయిట్ గా, ఆల్ మెటల్ బిల్డ్ తో నిర్మీతమైంది. ఈ ల్యాప్ టాప్ ను ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి, క్లాస్‌రూమ్ లేదా ఆఫీస్ వర్క్‌కు సులభంగా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఇందులో 14 అంగుళాల డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో విజువల్స్ మరింత స్మూత్ గా ఉంటుంది. ఆడియో భాగంలో DTS:X అల్ట్రా ఆడియో ఇచ్చారు. దీనివల్ల వీడియోలు చూడటం, సినిమాలు, ఆన్‌లైన్ మీటింగ్స్, మ్యూజిక్ వినేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
బ్యాటరీ విషయంలో కూడా ఈ మోడల్ ఆకర్షణీయంగా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది 19గంటల పాటు నాన్ స్టాప్ గా రన్ అవుతుంది. అలాగే 16 గంటల పాటు బ్రౌజింగ్ బ్యాకప్ ఇవ్వగలదు, అలాగే 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇందులో స్టోరేజ్, మెమరీ వివరాల్లో చూస్తే ఇది 16GB వరకు RAM, 512GB SSD తో వస్తోంది. అలాగే ఇందులో డ్యూయెల్ థండర్ బోల్ట్, 4 టైప్ సీ పోర్ట్, వైఫై 6 ఈ వంటి మోడ్రన్ ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ముఖ గుర్తింపు ద్వారా లాగిన్ అయ్యే అవకాశం ఉంది. Acer Swift Air 14 అనేది పోర్టబుల్, ఏఐ సపోర్ట్ తో వచ్చిన లాంగ్ బ్యాటరీ బ్యాకప్ డివైజ్. ప్రొఫెషనల్ గా యూజ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
