England: బంగారమో,డబ్బో దొరికితే ఓవర్ నైట్ లో తమ కష్టాలు తీరిపోతాయని చాలామంది భావిస్తుంటారు. అటువంటి అదృష్టం తలుపు తట్టకపోతుందా అని ఎదురు చూస్తుంటారు . రోడ్డు పక్కన బ్యాగులో, లంకెల బిందెలోనో సంపద దొరకాలని ఎక్కువమంది కలలు కంటారు. అయితే ఇది నిజజీవితంలో అంత వర్కౌట్ కావు. కానీ ఒక జంటకు మాత్రం ఇటువంటి అరుదైన అదృష్టం దక్కింది. వంటగది నిర్మాణం చేపడుతుండగా విలువైన నాణేలు దక్కాయి. ఎంచక్కా వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జీవితంలో తమ కష్టాలను తీర్చుకున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. సౌత్ ఇంగ్లాండు లో వెలుగు చూసింది ఈ ఘటన.
రాబర్ట్, బెట్టి ఫ్రూక్స్ అనే జంట సౌత్ ఇంగ్లాండ్ లోని వెస్ట్ డోర్ సెట్ లో 17వ శతాబ్దానికి చెందిన ఓ పురాతన కాటేజ్ ను కొనుగోలు చేశారు. దానిని తమ అభిరుచికి తగ్గట్టుగా నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా వంటగదిని పునర్ నిర్మించాలని భావించారు. దీనికోసం కాంక్రీట్ ఫ్లోర్ ను బద్దలు కొట్టారు. అయితే దాని నుంచి ఓ అద్భుతం బయటపడింది. 17వ శతాబ్దం కాలమునాటి 1000 నాణేలు బయటపడ్డాయి. కింగ్ చార్లెస్ కాలమునాటి అరుదైన నాణేలు ఒక పింగాణి కుండలో లభించాయి. దీంతో పురావస్తు శాఖ స్పందించింది. వాటిపై అధ్యయనం చేయడం ప్రారంభించింది. అవి 1642 -44 మధ్యకాలం నాటివని గుర్తించింది. ఈనెల 23న ఈ కాయిన్స్ వేలం వేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఔత్సాహికులు ఈ నాణాలను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. చివరకు రూ.62.88 లక్షలకు వేలం పాడుకున్నారు.
అయితే ఈ నాణేలు 2019 అక్టోబర్ లోనే వెలుగు చూశాయి. కానీ అప్పటినుంచి పురావస్తు శాఖ అధ్యయనాలు, లీగల్ ప్రొసీజర్స్ వంటివి పూర్తవడానికి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పట్టింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ జంటకు ఆ నాణాలను అప్పగించారు. ఆ తరువాతే వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇలా వచ్చిన మొత్తంతో తమ జీవిత అవసరాలు తీర్చుకుంటామని.. లోన్ పెట్టి ఇల్లు కొనుగోలు చేసిన దృష్ట్యా.. ఆ నాణేల ద్వారా లభించిన మొత్తం తమకెంతో ఉపయోగమని ఆ జంట చెబుతోంది. మొత్తానికి అయితే పాత ఇల్లు కొనుగోలు పుణ్యమా అని.. ఓవర్ నైట్ లోనే ఆ దంపతులు లక్షాధికారులుగా మారారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: A couple renovating their kitchen discovers a treasure trove of 17th century coins
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com