https://oktelugu.com/

Jobs: రైల్వేలో 520 గార్డ్‌ ఉద్యోగ ఖాళీలు.. ఏదైనా డిగ్రీ అర్హతతో?

Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 520 గార్డ్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. డిసెంబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. గూడ్స్‌గార్డ్‌ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండటం గమనార్హం. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 3, 2021 2:36 pm
Follow us on

Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 520 గార్డ్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. డిసెంబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. గూడ్స్‌గార్డ్‌ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండటం గమనార్హం.

Jobs

Jobs

రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. https://www.rrcser.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు కోల్ కతా కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. 520 ఉద్యోగ ఖాళీలలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 277 ఉద్యోగ ఖాళీలు, ఓబీసీ అభ్యర్థులకు 87 ఉద్యోగ ఖాళీలు, ఎస్సీ అభ్యర్థులకు 126 ఉద్యోగ ఖాళీలు, ఎస్టీ అభ్యర్థులకు 30 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

Also Read: ఏపీ డీఎంఈ విభాగంలో 326 ఉద్యోగాలు.. భారీ వేతనంతో?

ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేయవచ్చు. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష జరుగుతుంది. జనరల్‌ అవేర్‌నెస్‌, అర్థమెటిక్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

Also Read: ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జాబ్స్.. మంచి వేతనంతో?