Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. తాజాగా ఈ సంస్థ మరో జాబ్ మేళాను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ద్వారా కియా మోటార్స్, జస్ట్ డయల్ లో 200 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. కియా మోటార్స్ లో నీమ్ ట్రైనీ విభాగంలో 100 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఏదైనా బ్రాంచ్ లో డిప్లొమా చేసిన వాళ్లు అర్హులని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 15,000 రూపాయల వేతనంతో పాటు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు పెనుగొండలోని కియా ప్లాంట్ లో పని చేయాల్సి ఉంటుంది.
Also Read: రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. రూ.2,20,000 వేతనంతో?
పురుషులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు జస్ట్ డైల్ లో 100 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫీల్డ్ సేల్స్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. డిగ్రీ లేదా పీజీ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 17,000 రూపాయల నుంచి 23,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్, ఇన్సూరెన్స్ కవరేజీ కూడా పొందే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు శ్రీ సాయి సిద్దార్థ డిగ్రీ కాలేజ్, అనంతపూర్ కు ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు హాజరు కావాలి.