
కొత్త విద్యావిధానంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పీపీ-1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ఆరు రకాలుగా వర్గీకరణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 14వేల పాఠశాలలు అదనంగా అవసరమవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. కొత్త విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం సూచించారు. అర్హతలున్న అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని జగన్ ఆదేశించారు.