PM Modi: ప్రస్తుతం ప్రపంచంలో ఆయా దేశాల మధ్య జరుగుతున్నది వాణిజ్య యుద్ధం మాత్రమే కాదు.. అంతకుమించిన అత్యున్నత స్థాయి కుట్ర. రష్యా లో లభ్యమయ్యే చమురును ఇతర దేశాలు కొనకుండా అమెరికా ఆంక్షలు విధిస్తోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇది భారత్, చైనా కంపెనీలకు ఇబ్బందికరంగా మారాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అమెరికా విధించిన ఆంక్షలు మనకు ఒక రకంగా చాలా వరకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అమెరికా ద్వితీయ స్థాయి ఆంక్షలు అమలు చేస్తే రష్యా చమురు మనకు ఎంత తక్కువ ధరకు వచ్చినప్పటికీ.. ఆ కంపెనీలు మొత్తం అమెరికా డాలర్ల లావాదేవీలను పూర్తిగా కోల్పోతాయి. ఇది ఒక రకంగా ఆర్థిక నష్టం. దీర్ఘకాలికంగా మన దేశానికి ఇబ్బందికరంగా మారుతుంది.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
అమెరికా ఇటీవల పనికిమాలిన సుంకాలను మన మీద విధించింది. ఈ క్రమంలో మన దేశం నుంచి ఎగుమతులు అక్టోబర్ నుంచి సెప్టెంబర్ కాలంలో అమెరికాకు తగ్గిపోయాయి. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్ దేశాలకు ఎగుమతులను భారత్ పెంచుకుంది. ఇదే సమయంలో అమెరికాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవడానికి భారత్ ఇష్టపడలేదు. చమురుపై ఎలాంటి ఆంక్షలు ఉన్నప్పటికీ డిఫెన్స్ విభాగంలో అమెరికా సహకారం మన దేశానికి అత్యంత అవసరం. భారత వైమానిక దళం చైనా కంటే మెరుగైన స్థానం సంపాదించుకోవడానికి అమెPM Modi రికా సహాయం చేసింది. ప్రస్తుతం మన వైమానిక దళం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. చైనా ఈ వి భాగంలో మనకంటే వెనుకనే ఉంది.
నరేంద్ర మోడీ హయాంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏకంగా 21, 083 కోట్లకు చేరుకున్నాయి. మనం తయారు చేస్తున్న యుద్ధ విమానాలకు సంబంధించిన ఇంజన్లు అమెరికా నుంచి వస్తున్నాయి. డిఫెన్స్ టెక్నాలజీలో అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఇవి రష్యా వల్ల పరిష్కారం కాలేవు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నాడు కాబట్టి.. మనతో సంబంధాలను కొంతమేర నాశనం చేసినప్పటికీ.. డిఫెన్స్ విషయంలో ఇంతవరకు ట్రంప్ వేలు పెట్టలేదు. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో గతంలో మన వైమానిక దళం విన్యాసాలు చేసింది. అందువల్లే చైనా కంటే ముందు వరుసలో ఉంది.
ప్రధాని హత్యకు కుట్ర
అంతర్జాతీయ మీడియాలో.. జాతీయ మీడియాలో కొద్దిరోజులుగా నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కేవలం మన ప్రధాని నరేంద్ర మోడీ మీద మాత్రమే కాకుండా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మీద కూడా హత్యాయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల షాంగై సహకార సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. చైనా గడ్డమీద అడుగు పెట్టారు. ఆ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరయ్యారు.
ఈ సమావేశాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. అమెరికా మీడియా ఇష్టానుసారంగా ఈ సమావేశంపై అడ్డగోలుగా వార్తలు రాసింది. ఇదంతా ఊహించిందే. ఆ సమావేశాన్ని పనికిమాలిన వ్యవహారం లాగా ట్రంప్ పేర్కొనడం విశేషం. ట్రంప్ అలా మాట్లాడిన తర్వాత.. నరేంద్ర మోడీని హత్య చేయడానికి ఓ అమెరికన్ పౌరుడు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎక్కించుకొని తీసుకొనివెళ్ళారు. ఆ తర్వాత అమెరికన్ పౌరుడిని చైనాలోని భద్రత దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత ఆ పౌరుడు బంగ్లాదేశ్లో అత్యంత అనుమానాస్పదంగా మరణించాడు. ఆ వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు..
నరేంద్ర మోడీపై హత్యాయత్నం విఫలం కావడానికి రష్యా సహకారం అందించింది. చైనా తోడ్పాటు అందించింది. ఈ ఘటన తర్వాత నరేంద్ర మోడీ ఈజిప్ట్, మలేషియా పర్యటనలను రద్దు చేసుకున్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా విదేశీ పర్యటనలను మానుకున్నారు. దీనికి ప్రధాన కారణం భద్రతా సమస్యలే. ఈ సమయంలో వారిద్దరు దేశం దాటి వెళ్లడం అత్యంత ప్రమాదకరమని నిఘా వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్లో హతమైన అమెరికన్ పౌరుడు ఒక ఏజెంట్ అని తెలుస్తోంది. ఇంత జరిగిన తర్వాత కూడా అమెరికా స్పందించలేదు. అమెరికా మీడియా కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అంతకుముందు జరిగిన షాంగై సదస్సు మీద పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసిన అమెరికా మీడియా.. తమ పౌరుడు బంగ్లాదేశ్లో చనిపోతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం సింగిల్ వార్తను కూడా ప్రసారం చేయలేదు. చనిపోయిన వ్యక్తి వద్ద భారీగా నగదు లభించినట్టు తెలుస్తోంది. అతడు మనదేశంలో ఆరాచకాన్ని సృష్టించేందుకు ఆ నగదును ఉపయోగించుకోవాలని భావించినట్టు సమాచారం. ఇదే సమయంలో రాహుల్ గాంధీ “ప్రజాస్వామ్యాన్ని రక్షించడం నా బాధ్యత కాదు” అని వ్యాఖ్యానించడం కోస మెరుపు. వాస్తవానికి ఏదైనా జరగడానిది జరిగితే 1992, 2002 స్థాయిలో దేశంలో ఘోరాలు మించిపోయి..గంగా, యమునా నదులు కూడా ఎర్రబడి పోతాయని మీడియాలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
