Homeజాతీయం - అంతర్జాతీయంAfghanistan Currency: ఆఫ్గాన్‌ కరెన్సీ.. మన రూపాయికన్నా విలువెక్కువ.. కారణం ఇదే!

Afghanistan Currency: ఆఫ్గాన్‌ కరెన్సీ.. మన రూపాయికన్నా విలువెక్కువ.. కారణం ఇదే!

Afghanistan Currency: భారత్‌ ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుంటే, యుద్ధాలు, పేదరికం, ఉగ్రవాదం మధ్య జీవిస్తున్న ఆఫ్గానిస్తాన్‌ కరెన్సీ మాత్రం భారతీయ రూపాయిని మించిపోయింది. ప్రస్తుతం 1 ఆఫ్గాన్‌ ఆఫ్ఘనీ విలువ సుమారు 1.33 రూపాయలు ఇది ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి, ఇది ఆ దేశం స్థిర ఆర్థిక పరిస్థితిని సూచించేది కాదు, కానీ తాలిబన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ద్రవ్య నియంత్రణల ఫలితం.

విదేశీ కరెన్సీలపై నిషేధం..
2021లో అధికారంలోకి వచ్చిన తాలిబన్‌ ప్రభుత్వం అమెరికన్‌ డాలర్, పాకిస్తాన్‌ రూపాయి వంటి విదేశీ కరెన్సీల వాడకాన్ని పూర్తిగా ఆపేసింది. దాంతో దేశీయ లావాదేవీలు మొత్తం ఆఫ్ఘనీల్లోనే జరగడం ప్రారంభమైంది. ఇది తక్షణమే స్థానిక కరెన్సీ డిమాండ్‌ను పెంచి, ఆఫ్గానీ విలువకు కృత్రిమ స్థిరత్వం ఇచ్చింది. అదే సమయంలో తాలిబన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నగదు ప్రవాహాన్ని కట్టుదిట్టంగా నియంత్రిస్తూ, మార్కెట్‌లో అధిక కరెన్సీ సరఫరాను అడ్డుకుంటోంది. ఈ చర్యల వల్ల ఆఫ్ఘనీ విలువ బహిరంగ మార్కెట్‌ ప్రభావం లేకుండా స్థిరంగా ఉంది.
అంతర్జాతీయ వాణిజ్యం లేక..
భారత్‌ వంటి పెద్ద దేశాలు ప్రపంచ మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై బలంగా ఆధారపడుతున్నాయి. అందువల్ల గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్పులు నేరుగా రూపాయి విలువను ప్రభావితం చేస్తాయి. ఆఫ్గానిస్తాన్‌ మాత్రం ఈ వ్యవస్థల నుంచి దాదాపు వేరు. దిగుమతులు తక్కువ, ఎగుమతులు పరిమిత స్థాయిలో ఉండటంతో అంతర్జాతీయ మారకపు ఒత్తిడి ఆ కరెన్సీపై తక్కువగా ఉంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా విదేశీ పరస్పర లావాదేవీలు కూడా చాలా స్వల్పంగా మాత్రమే జరుగుతాయి.

బలమైన ఆర్థిక వ్యవస్థ కాదు..
ఆఫ్ఘనీ విలువ రూపాయికన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆఫ్గానిస్తాన్‌ ప్రగతిలో ముందుకు సాగుతున్న దేశమని చెప్పలేం. అక్కడి ప్రజలు తీవ్రమైన నిరుద్యోగం, పేదరికం, మార్కెట్‌ కొరతలతో ఎదుర్కొంటున్నారు. కరెన్సీ బలంగా ఉండటం ద్రవ్య సరఫరా కృత్రిమంగా నియంత్రించబడుతున్న సూచన మాత్రమే. నిజంగా ఒక దేశ ఆర్థిక శక్తి పరిశ్రమలు, ఉత్పత్తి సామర్థ్యం, స్థిరమైన పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది.

తాలిబన్‌ ప్రభుత్వం కరెన్సీ విలువను కాపాడటం ద్వారా విదేశీ ద్రవ్య మార్కెట్‌లో ప్రతిష్ఠను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. అంతర్గత ఆర్థిక వ్యవస్థ మాత్రం శూన్య స్థాయిలో ఉంది. సంస్కరణలు, పెట్టుబడులు, పరిశ్రమలు లేకుండా కరెన్సీ బలం ఎక్కువ కాలం నిలవడం అసాధ్యమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version