
ఇవాళ లేదా రేపట్నుంచి కొవిడ్ టీకాల రవాణాను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రయాణికుల విమానాల్లో టీకాలను రవాణా చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా టీకాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రేపటి డ్రై రన్, టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడంపై మాట్లాడారు. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కేసులు అనూహ్యంగా పెరిగాయని ఆయన అన్నారు.