
కృష్ణా జిల్లా గన్నవరం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్‌లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సభలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల మతాలతో.. పార్టీలకు సంబంధం లేకుండా ఒకే దృష్టితో పని చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలనేదే సీఎం జగన్ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్‌కి మంచి పేరు రావడం ఇష్టం లేక ఇళ్ల స్థలాల విషయంలో కోర్టుకు వెళ్లి లాయర్ల ద్వారా స్టే ఇచ్చిన వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు అని విమర్శించారు.