
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయడంపై శివసేనపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాటల దాడికి దిగింది. పీఎంసీ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి వర్ష రౌత్‌కు ఈడీ మూడుసార్లు నోటీసులు పంపిందని, అయితే వాటికి సంజయ్ రౌత్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని బీజేపీ సీనియర్ నేత కిరిట్ సోమయ్య ప్రశ్నించారు. సంజయ్ రౌత్‌పై పదునైన ట్వీట్లతో తరుచూ విరుచుకుపడే సోమయ్య.. దర్యాప్తుకు సంబంధించి ఈడీ ప్రశాంతమైన వాతావరణంలో వివరణ కోరితే శివసేన నేత ఎందుకంత ఆగ్రహం చెందుతున్నారని ఎద్దేవా చేశారు.