
జమిలీ ఎన్నికలపై ప్రధాని నరంద్ర మోదీ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ‘ఒకే దేశం… ఒకే ఎలక్షన్’ అన్న నూతన పద్ధతిని అమలు చేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు. ”జమిలీ ఎన్నికలకు మేం సిద్ధమే. పార్లమెంట్ వీటిపై విస్తృతమైన సవరణలు చేసిన తర్వాత… వన్ కంట్రీ- వన్ నేషన్’ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు మేం సిద్ధమే.” అని సునీల్ అరోరా ప్రకటించారు.