దేశీయ వస్తువులనే వాడండి: మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

దేశ ప్రజలు మేడిన్ ఇండియా వస్తువులనే వాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. స్వయం సమ్రుద్ధిలో భారత్ తయారీ వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు. మనం తయారు చేసే వస్తువులు క్వాలిటీగా ఉంటే కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు.2020లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. ప్రతి సవాల్ ను ఓ గుణపాఠంగా స్వీకరించాలన్నారు. ఢిల్లీ మార్కెట్ లో ఒకప్పుడు విదేశీ వస్తువులు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు దేశీయంగా తయారైన […]

Written By: Velishala Suresh, Updated On : December 27, 2020 1:54 pm
Follow us on

దేశ ప్రజలు మేడిన్ ఇండియా వస్తువులనే వాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. స్వయం సమ్రుద్ధిలో భారత్ తయారీ వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు. మనం తయారు చేసే వస్తువులు క్వాలిటీగా ఉంటే కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు.2020లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. ప్రతి సవాల్ ను ఓ గుణపాఠంగా స్వీకరించాలన్నారు. ఢిల్లీ మార్కెట్ లో ఒకప్పుడు విదేశీ వస్తువులు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు దేశీయంగా తయారైన వస్తువులనే ఎక్కువగా వాడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి దారులు, పారిశ్రామిక వేత్తలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వస్తువులను తయారు చేయాలన్నారు. 2020లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు.