వైసీపీ, బీజేపీలు టీడీపీని టార్గెట్‌ చేశాయట..

ఆదివారం వచ్చిందంటే ఆ టీడీపీ అనుకూల పత్రికలో ‘పలుకుల’ పేరిట ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ వారం వారం ఓ కథ అల్లుతుంటాడు. కామన్‌గా ఎవరు ఏమనుకున్నా ఆయనకు టీడీపీపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. అది ఆయన పేపర్‌‌ చూసినా.. ఆయన వార్తలను చూసినా.. ఆయన కొత్తపలుకులను చూసినా అర్థమవుతూనే ఉంటుంది. ఒక టీడీపీ కండువా మాత్రం వేసుకోలేదు కానీ.. టీడీపీ ప్రయారిటీ వార్తలే కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు వచ్చిన ఆర్టికల్‌ కూడా […]

Written By: Srinivas, Updated On : December 27, 2020 1:52 pm
Follow us on


ఆదివారం వచ్చిందంటే ఆ టీడీపీ అనుకూల పత్రికలో ‘పలుకుల’ పేరిట ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ వారం వారం ఓ కథ అల్లుతుంటాడు. కామన్‌గా ఎవరు ఏమనుకున్నా ఆయనకు టీడీపీపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. అది ఆయన పేపర్‌‌ చూసినా.. ఆయన వార్తలను చూసినా.. ఆయన కొత్తపలుకులను చూసినా అర్థమవుతూనే ఉంటుంది. ఒక టీడీపీ కండువా మాత్రం వేసుకోలేదు కానీ.. టీడీపీ ప్రయారిటీ వార్తలే కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు వచ్చిన ఆర్టికల్‌ కూడా దానికే భాష్యం చెబుతోంది. మరోసారి టీడీపీ మీద ఉన్న ప్రేమను వెల్లగక్కాడు ఆ పత్రికాధినేత.

Also Read: ఏపీ బీజేపీకి అస్త్రంగా రాజాసింగ్‌

ఆ కథనంలోని సారాంశాన్ని చూస్తే ప్రధానంగా.. వైసీపీ, బీజేపీ కలిసి టీడీపీని తొక్కేయాలనుకుంటున్నాయని. తెలంగాణలో మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో బీజేపీ ఎదగడానికి తన వంతు సాయం చేయబోతున్నారట. ఆయన తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు..అన్ని ప్రయత్నాలు చేస్తూ.. ఇంకా పెంచుకునేందుకు మత మార్పిళ్లు చేస్తూ.. బీజేపీ ఎదిగినా తనకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో భేటీ సమయంలోనూ ఈ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

తిరుపతి ఉపఎన్నిక విషయంలో వైసీపీకే అధికార పార్టీ అడ్వాంటేజ్ ఉంటుందని ఆ పత్రికాధినేత తేల్చారు. అయితే.. మెజార్టీ తగ్గించినా బొటాబొటితో వైసీపీ గెల్చినా అది గెలుపు కాదని.. తీవ్రమైన అసంతృప్తికి నిదర్శనంగా మిగిలిపోతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రెండో స్థానానికి రావాలని చేస్తున్న ప్రయత్నాలను ఆయన చెప్పేశారు. ఏ పార్టీ అయినా.. గెలుపు కోసమో రెండో స్థానంలో ఉండటం కోసమో పనిచేస్తుంది. కావాలని ఓడిపోవడానికి ఎవరూ పోటీ చేయరు. అయితే ఈ మేధావి మాత్రం వైసీపీ, బీజేపీలు కలిసి టీడీపీని లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే పోటీ చేస్తాయని చెబుతున్నారు.

Also Read: వీహెచ్‌కు వాళ్లపై అంత అక్కసు ఎందుకో..

అయితే.. ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్న అనుమానం ఒక్కటే. రాజకీయాల్లో ఒక పార్టీకి ఇంకో పార్టీ సహకరించడం అంత సాధ్యపడే అంశమా. అసలు ఎవరైనా అలా చేస్తారా..? అని. పక్క నేతలను తొక్కేసి తాము అధికారంలోకి రావాలనే కదా అందరూ చూస్తారు. కానీ.. సుదీర్ఘకాలంగా జర్నలిజంలో ఉన్న ఆ పత్రికాధినేతకు ఆమాత్రం తెలియదా. టీడీపీపై ప్రజల్లో ఓ రకమైన సానుభూతి.. జాలి కల్పించి.. బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న భావనను కూడా ప్రజల్లో కల్పించేందుకు ఆయన తన పలుకుల ద్వారా ప్రయత్నించినట్లుగా స్పష్టమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్