
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 కింద రద్దు చేయబడిన ప్రత్యేక ప్రతిపత్తిని మళ్లీ పునరుద్ధరించే వరకు ఏ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేయదని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీపై పొత్తుపై ఆమె స్పందిస్తూ తన తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యిద్ పొత్తు పెట్టుకున్నది ఒక దుష్టశక్తితోనని తీవ్రంగా మండిపడ్డారు. అయితే కశ్మీర్ ప్రయోజనాల కోసమే తన తండ్రి ఆ పని చేశారని, కానీ బీజేపీ అవకాశవాదంగా వ్యవహరించి తమను మోసం చేసిందని మెహబూబా విమర్శలు గుప్పించారు.