
వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు బుధవారం రైతు సంఘాలతో నిర్వహించాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. మంగళవారం రైతు సంఘాలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశమైన విషయం తెలిసిందే. రైతు సంఘాల నేతలు లేవనెత్తిన అంశాలపై సవరణలకు సుముఖంగా ఉన్నట్లు అమిత్‌షా తెలిపారు. నోటిఫైడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెట్ కమిటీల్లో (ఏపీఎంసీ) ఫీజు నిర్మాణానికి సంబంధించిన సవరణలు, రైతుల భూ హక్కులను పరిరక్షించడానికి కఠినమైన నిబంధనలు, నోటిఫైడ్ మార్కెట్లను బలోపేతం చేయడం, కనీస మద్దతు ధరలపై (ఎంఎస్‌పీ) హామీ ఇవ్వాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.