
బీహార్ రాష్ట్రంలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గయా జిల్లా బారాఛట్టిలో ఆదివారం కోబ్రా కమాండోలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, మ్యాగజీన్ ను కమాండర్లు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ పోలీసులతో పాటు కోబ్రా కమాండోలు మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవలే ఎన్నికలు జరిగి నితీశ్ ప్రభుత్వం ఏర్పడింది. గత కొద్ది రోజులగా అడవుల్లో అలజడి లేదు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే మావోయిస్టులు మృతి చెందడం చర్చనీయాంశంగా మారుతోంది.