ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని విష్ణు గార్డెన్ ఏరియాలో శనివారం ఓ ఇంటి పైకప్పు కూలి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఇల్లు పురాతనమైనదని అందుకే ఒక్కసారిగా పైకప్పు కూలిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం నెలకొన్న ఇంటిని ఆనుకొని మోటార్ వైండింగ్ ఫ్యాక్టరీ ఉంది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.