
భారత్‌లో కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలిగిపోలేదని ప్రధాన మంత్రి నరేంద్రమోడి అన్నారు. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి బాల సాహెబ్ విఖే పాటిల్ ఆటోబయోగ్రఫీని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్క్‌లు ధరించడం, బౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కొద్దిరోజులు కరోనా పాజిటివ్‌ల సంఖ్య తగ్గువగా వస్తున్నా అంతరంగా మాత్రం వైరస్ ఇంకా తొలిగిపోలేదన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే పెను ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.