విజయవాడలోని దుర్గామాత ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డులో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు బండరాళ్లు ఇంకా ఎక్కువగా పడకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. విజయవాడలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో కొండపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి ఘాట్‌రోడ్డుపై పడ్డాయి. అయితే ఈ సమయంలో వాహనాలు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పరిమితంగా వాహనాలను అనుమతించారు.