
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంపిన లిఖిత పూర్వక హామీని తిరస్కరిస్తూ సంయుక్త్ కిసాన్ మోర్చా వ్యవసాయ శాఖకు బుధవారం మెయి్ చేసింది. గతవారం చర్చల్లో భాగంగా చట్టాలకు సవరణలు చేస్తామని రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రతిపాదనను స్వీకరించిన రైతుల సంఘాలు తిరస్కరించిన విషయాన్ని ఈమెయిల్ ద్వారా తెలిపాయి. రైతు ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి కేంద్ర చేస్తున్న చర్యలు మానుకోవాలని, ఇతర రైతు సంఘాలతో చర్చలు జరపకూడదని సంయుక్త్ కిసాన్ మోర్చ స్పష్టం చేసింది.