Homeజాతీయం - అంతర్జాతీయంకరోనాతో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ రెండో వన్డే కూడా వాయిదా

కరోనాతో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ రెండో వన్డే కూడా వాయిదా

కరోనా భయం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తొలి వన్డే ఒకసారి వాయిదా పడి.. ఆ తర్వాత మొత్తానికే రద్దు కాగా.. ఇప్పుడు రెండో వన్డేను కూడా వాయిదా వేశారు. ఇంగ్లండ్ టీమ్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్న వార్తల నేపథ్యంలో వన్డే మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. సోమవారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ను మంగళవారానికి వాయిదా వేశారు. బుధవారం మూడో వన్డే జరగాల్సి ఉంది. గురువారం రోజు ఇంగ్లండ్ టీమ్ సౌతాఫ్రికా నుంచి స్వదేశానికి బయలుదేరనుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఈ రెండు వన్డేలు కూడా అసలు జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version