ఇంకా ఎన్ని గొంతులు నొక్కుతారు..? ఇంకా ఎంతమందిని వేధిస్తారు..? అంటూ బాలీవుడ్ నటి కంగనా రానౌత్ మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన విషయం తెలిసింది. ఈ అరెస్టును కంగనా ఖండించింది. ఈ సందర్భంగా ఆమె ట్వట్టర్లో పోస్టు చేసింది. ‘అర్నాబ్ గోస్వామి ఇంట్లోకెళ్లి, ఆయన జుట్టు పట్టుకొన లాగడం సబబేనా..? మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను సోనియా సేన నోరు మూయించాలని ప్రయత్నిస్తే మరిన్ని గొంతులు పైకి లేస్తాయి’ అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. ఇంతకుముందు ఎంతో మంది దేశ భక్తల గొంతులు కోశారు. ఎంతో మందరికి ఉరితాళ్లు బిగించారు. అయినా వెనుకడుగు వేయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.