
ఘోర రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సత్నా జిల్లాలోని సోమవారం ఎదురురెదురుగా వచ్చిన కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ప్రమాదంలో కారులో వెళ్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని రేవా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్నవారి పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.